తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్ను తుపాకీతో కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ ఘటనపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2020లో ఘటన జరిగినపుడు 15 మంది మృతి చెందారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. 2023, డిసెంబర్ నెలలో జరిగే ఉత్సవ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో జరిగింది. నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస�
బీజేపీ సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భం అందరూ చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సమసమాజం స్థాపనకు బీజేపీ పాటుపడుతుందన్నారు. మోడీ అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో రెండు, మూడు స్థానాలకు చేరుకుంటుం
ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సబ్స్టేషన్లు, విద్యుత్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పునరుత్పాదక విద్యుత్�
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో తొలుత ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.