మద్యం సేవించి భార్యను నానా హింసలు పెట్టడంతో,ఆ బాధలు భరించలేక కట్టుకున్న భార్య తన భర్తను కడతేర్చిన ఘటన ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. ఈ చంద్ర మిషన్ 2019 సంవత్సరం చంద్రయాన్ 2 తదుపరి మిషన్. భారతదేశం ఈ మూడవ మిషన్‌లో, శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ 'సాఫ్ట్ ల్యాండింగ్' లక్ష్యంగా పెట్టుకున్నారు.
జనసేన టీడీపీకి బీ టీమ్ అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు, మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ వాళ్లు జనసేనని బీ టీం అంటుంటే.. బయటి వాళ్లు అనడం వేరు .. మనవాళ్లు అనడం వేరు అంటూ జనసేన నాయకులకు ఆయన సూచించారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. పురంధేశ్వరికి సోము వీర్రాజు బాధ్యతలను అప్పగించారు. విజయవాడ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ముందు వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అంటూ మంత్రి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా అంటూ మాట్లాడారు.