Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్‌కు అనీత్ పద్దా గండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనీత్ పద్దా ప్రజెంట్ బాలీవుడ్ నయా సెన్సేషనల్ హీరోయిన్. గత ఏడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సైయారాతో యూత్ హార్ట్ థ్రోబ్‌గా మారిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనీత్ పద్దాకు క్రేజ్ ఏర్పడింది. బడా నిర్మాణ సంస్థలు ఆమె కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. దాంతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యూటీని మడాక్ ఫిల్మ్స్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం గ్రాబ్ చేసింది. మడాక్ హారర్ కామెడీ యూనివర్శ్ నుండి వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ శక్తి షాలినిలో అనీత్ లీడ్ రోల్ చేస్తోంది.
యాక్చువల్లీ శక్తి షాలినిలో ఫస్ట్ కియారాను అనుకున్నారు. కానీ కియారా ప్రెగ్నెంట్ కావడంతో ఆ ప్లేసులోకి అనీత్ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఎండింగ్‌లో రావాల్సిన ఈ ఫిల్మ్.. నెక్ట్స్ ఇయర్ డిసెంబర్‌కు వాయిదా పడింది. ఇప్పటి వరకు మడాక్ కామెడీ యూనివర్శ్‌లో స్త్రీ, స్త్రీ2 లేడీ ఓరియెంట్ చిత్రాలతో శ్రద్ధా కపూర్ డామినేట్ చేస్తే.. నెక్ట్స్ శక్తి షాలినితో సైయారా బ్యూటీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. శక్తి షాలిని మాత్రమే కాదు కియారా అద్వానీ మరో ఆఫర్‌కు గండి కొట్టిందట అనీత్ పద్దా. లెజండరీ యాక్ట్రెస్ మధుబాల బయోపిక్‌లో అనీత్ పద్దా ఫిక్స్ అయ్యిందట. తొలుత కియారా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ రోల్ సైయారా బ్యూటీకి చెంతకు చేరిందని సమాచారం. ఫ్రెష్ ఫేస్ కోసం అనీత్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించబోతున్నాడని టాక్. ఆలియా భట్ డార్లింగ్స్ ఫేం జస్మీత్ కీ రీన్ దర్శకత్వం వహించనుందట. అయితే ఇవి రూమర్స్ అంటోంది అనీత్ క్లోజ్ సర్కిల్. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే.. మధుబాల లాంటి బరువైన పాత్రను అనీత్ చేయగలదా? కెరీర్ స్టార్టింగ్‌లోనే, మధుబాల లాంటి స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటోన్న సైయారా బ్యూటీ, ఆ రోల్‌కు న్యాయం చేస్తుందంటారా.
Also Read
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
- భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
తాజావార్తలు
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!