దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పవన్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీఆర్పీలో ఉన్నప్పుడే వైఎస్సార్‌ను పంచలు ఊడదీసి కొడతానన్నారని.. అప్పుడే పవన్ రాజకీయాలకు పనికి రాడని ప్రజలు అనుకున్నారని అంబటి రాంబాబు అన్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
ఏదైనా ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయంటే ఎవరైనా ఊరికే ఉంటారా?. వెంటనే వజ్రాల కోసం వేట ప్రారంభించేస్తారు కదా. అలాంటి సంఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాల వేటను ప్రారంభించారు.
సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం భూమికి సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టిందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన్నారు. 20 ఏళ్లు భూమి సాగు చేసుకున్న వారికి ఇప్పుడు యాజమాన్య హక్కులు కల్పించామన్నారు.
వైఎస్సార్సీపీ పార్టీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య అని.. ఏ విషయమైనా తనతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు.
ఏపీ అంటే ఆక్వా హబ్ అని.. ఏటా సగటున ఒక వ్యక్తి 8 కేజీల ఫిష్ వినియోగిస్తున్నారని ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఏపీలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందన్న ఆయన.. వినియోగం తక్కువగా ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచాలన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.