Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spinach Dosa Recipe: ఆరోగ్యంగా ఉండటానికి ఆకుకూరలు ఎంతో అవసరమో అందరికీ తెలిసిందే. కాబట్టి పాలకూరలో ఐరన్, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలామంది పిల్లలు పాలకూరను నేరుగా తినడానికి ఇష్టపడరు. ఇలాంటి సమయంలో పాలకూరతో రుచికరమైన దోశలు తయారు చేస్తే వారు ఇష్టంగా తింటారు. సాధారణ దోశలకు కాస్త భిన్నంగా ఉండే ఈ పాలకూర దోశలు రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ఇప్పుడు ఈ సింపుల్, టేస్టీ పాలకూర దోశలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సాధారణ దోశలకు భిన్నంగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూరతో దోశలను మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం.
Also Read
కావలసిన పదార్థాలు:
దోశ పిండి: తగినంత
పాలకూర: ఒక కట్ట (శుభ్రం చేసుకున్నది)
పచ్చిమిర్చి: 3–4 (కారం తగ్గట్టు)
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: అర టీస్పూన్
ఉప్పు: రుచికి తగినంత
నూనె: దోశలు కాల్చడానికి
తయారీ విధానం:
పాలకూర పేస్ట్ తయారీ:
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో పాలకూర ఆకులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
పిండి తయారీ:
తయారు చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని దోశ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి, పిండి మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి దోశల పిండిలా సిద్ధం చేసుకోవాలి.
Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
దోశ వేయడం:
స్టవ్ మీద దోశ పెన్నం పెట్టి వేడి చేయాలి. పెన్నం వేడయ్యాక ఒక గరిటె పిండి తీసుకుని పల్చగా దోశలా పరవాలి. దోశ చుట్టూ కొద్దిగా నూనె వేసి, మధ్యస్థ మంట మీద రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే.. వేడి వేడి పాలకూర దోశలు సిద్ధం. వీటిని పల్లీల చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
మీరు మరింత రుచి కోసం దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు లేదా తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అలాగే కావాలంటే దీనిపై గుడ్డు వేసి పాలకూర ఎగ్ దోశలా కూడా ప్రయత్నించవచ్చు.
తాజావార్తలు
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!