Botsa Satyanarayana: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కాంలు జరిగాయో చూశాం. అన్ని చూచిరాతలే. ఎంత మంది అరెస్టులు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయి. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి విధానం వారిది” అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
Also Read: Botsa Satyanarayana: పవన్ కళ్యాణ్ కామెంట్స్‌కు బొత్స కౌంటర్
మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి హీట్ పెంచాయి. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా..గతంలో కూడా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏపీలో రోడ్లు, విద్యుత్ సహా పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు ఘాటు విమర్శలు చేసుకున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కూడా హీట్ పెంచేలా ఉన్నాయి.