విశాఖను ఒక బ్రాండ్‌గా మారుస్తాం.. 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు..
విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతాం.. విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్.. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే ఐదవ స్థానంలో నిలపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. విశాఖను ఒక బ్రాండ్ గా మార్చుతాం.. విశాఖలో 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు.. అనకాపల్లి జిల్లా పర్యటన కోసం.. విశాఖకు వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంగా విశాఖ ఎప్పుడూ మమ్మల్ని ఆదరిస్తూనే వుంది… 2019లో రాష్ట్రం అంతా ఒక విధమైన ఫలితం వస్తే.. ఇక్కడ టీడీపీ గెలిచింది.. 2024 ఎన్నికల మెజారిటీ లో నాదే రికార్డు అనుకున్నా.. గాజువాక, భీమిలిలో నాకంటే ఎక్కువ మెజారిటీలు రావడం ఇక్కడ ప్రజల ఆదరణకు నిదర్శనంగా అభివర్ణించారు.. ఇక, విశాఖలో అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభం కానుంది.. TCS డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది.. NTPC హైడ్రో పవర్ గేమ్ చేంజర్ కానుంది అన్నారు మంత్రి లోకేష్.. గతంలో వెళ్ళిపోయిన లులూ గ్రూప్ మళ్ళీ ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి సిద్ధం అవుతోందని వెల్లడించారు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ రూపు రేఖలు మారిపోనున్నాయి.. అంతర్జాతీయ సదుపాయాలతో మరిన్ని స్టేడియాలను నిర్మాణం చేస్తాం అన్నారు.. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలోపు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలతో విశాఖ కూడా అంతర్జాతీయ నగరంగా మారుతుందని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..
యువత కోసం పవన్ కల్యాణ్ తపన.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయి..!
యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తపన పడుతున్నారు.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఉత్తరాంద్ర యువతకు ఉపాధి కల్పించాలని తపన పడుతున్నతారు.. ఉత్తరాంద్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. దీపం పథకం -2, లో భాగంగా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందించాము. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలలో రైతులకు డబ్బులు అందించాం.. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నాం.. పవన్ కల్యాణ్ గిరిజన గ్రామాలలో పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ధి, సంక్షేమం అందించదనికి ప్రణాళిక తయారుచేసుకున్నాం అన్నారు నాదెండ్ల మనోహర్.. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతం అయ్యిందన్న ఆయన.. సభ విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.. అన్ని స్థాయిలలో కమిటీలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. టీడీపీ, బీజేపీతో కలసి ప్రజలు కోసం అంకితభావంతో జనసేన నాయకులు పనిచేయాలని సూచించారు.. గత ప్రభుత్వంలో విశాఖపట్నరంలో లాండ్ అడర్ సమస్య సృష్టించారు. ఋషికొండలో ప్రజాధనంతో ప్యాలస్ నిర్మించారు. విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డారు, పర్యావరణం విధ్వసం చేశారని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్..
కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం..
కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం.. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.. అయితే, ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నారు.. లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న షిప్‌ను జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన తెలంగాణ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి.. తెలంగాణ కేబినెట్ విస్తరణ గురించి నాకు సమాచారం లేదన్నారు.. ఫిలిప్పీన్స్ కి 8 లక్షల టన్నులు బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం.. అందులో భాగంగా తొలివిడతగా 12500 టన్నుల బియ్యం పంపిస్తున్నాం అని వెల్లడించారు.. ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి.. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందన్నారు.. మా రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు.. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు.. స్వయంగా నేను వెళ్లి రైస్ ఎగుమతులు పై చర్చిస్తాను అన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..
నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్.. వారికే అవకాశం..!
ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రస్తుతం పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి ఏ పదవులు వస్తాయి పార్టీకి కష్టపడినా వాళ్లకు పదవులు వస్తాయా లేదా అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటున్నారు.. ఎవరెవరికి నామినేటెడ్ పదవులు.. ఇవ్వాలి… కార్యకర్తలు ఎవరు పార్టీకోసం సీరియస్ గా వర్క్ చేశారు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు ఎవరున్నారు.. వీళ్లు అందరి జాబితా కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు.. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొన్ని పేర్లను పంపించారు.. మరి కొంతమంది ఎమ్మెల్యేలు పంపించాల్సి ఉంది.. ఎమ్మెల్యేలు కూడా వెంటనే జాబితా పంపించాలని ముఖ్యమంత్రి చెప్తూనే ఉన్నారు. అయితే, ఇప్పటికే 47 మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించింది టీడీపీ.. ఇందులో జనసేన కు సంబంధించి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి.. త్వరలో మరికొన్ని పదవులు భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.. రాష్ట్రస్థాయిలో దేవాలయాలు పాలక మండళ్లు మరి కొన్ని కీలక సంస్థలకు చైర్మన్ల భర్తీ జరగనుంది. అదే విధంగా ఇతర పదవులకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.. కూటమిలో ఉన్న పార్టీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.. ఆ మూడు పార్టీల నుంచి కీలకంగా ఉన్న వారికి నామినేటెడ్ పదవులు రానున్నాయి.. ఆల్రెడీ.. జనసేన బీజేపీ ఇప్పటికే కొన్ని పేర్లు ఇచ్చింది.. వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొంచెం భారీ స్థాయిలో పదవులు ఇవ్వనుంది. ఈ రెండు పార్టీలు ఇచ్చిన అభ్యర్థులను దృష్టి లో పెట్టుకుని టీడీపీ రెండో దఫా నామినేటెడ్ పోస్టుల ప్రకటన చేయనుంది.. త్వరలోనే ఇంకో దాఫా ప్రకటనకు సిద్ధమవుతోంది.. ఇప్పటికే ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల్లో సభ్యులు కూడా ఉన్నారు. వీటితోపాటు రాష్ట్రస్థాయి దేవాలయాలు పాలక మండళ్లు, చైర్మన్ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లు… ఇవన్నీ కూడా త్వరలోనే నామినేట్ కానున్నాయి.
స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి” అనే నినాదంతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయితీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమాత్రం చేయలేకపోయాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాకుండా ఈ రెండు పార్టీలపై పోరాటం చేయాలని ఆయన బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ బలపడాలని, రాష్ట్ర సమస్యలపై పోరాడాలని, అధికారంలోకి రావాలని ప్రజలు చూస్తున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో మళ్ళా నీళ్ల యుద్ధం మొదలైంది
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు జలాశయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటి సమర్థ్య విలువలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే గంగుల. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మళ్ళా తాగునీటి సమస్య, నీటి యుద్ధం మొదలైందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి నెలలో ఇంత డెడ్ స్టోరేజీకి ఎప్పుడు వెళ్ళలేదని ఆయన వ్యాఖ్యానించారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటికి కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు పడడం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఇన్చార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎల్లంకి కనీసం 13 టీఎంసీల నీరును నింపే ప్రయత్నం చేయాలన్నారు. ఎల్ఎండీ నుండి దిగువకు నీరు వెళ్తున్నది కానీ పైనుండి ఎల్‌ఎండీకి నీరు రావడం లేదని ఆయన అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కడితే ఆ నీరు ఏమైనా కలుషితంగా మారినాయా అని ఆయన ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాలేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని గంగలు కమలాకర్ మండిపడ్డారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి నీరు నింపకపోతే ఏప్రిల్ 5వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇసుక బస్తాలతో నీరును ఆపేస్తామని ఆయన అన్నారు.
‘‘ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్‌లపై నమాజ్ ఆపడంతో నిరసన..
రంజాన్ సందర్భంగా ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయవద్దని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కోరారు. ముఖ్యంగా మీరట్ ప్రాంతంలో ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, పాస్‌పోర్టు, లెసెన్సులు క్యాన్సల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ఈ రోజు ఈద్ ప్రార్థనల సందర్భంగా మీరట్ రోడ్లపై నమాజ్ చేయడాన్ని అడ్డుకోవడంతో నిరసనకారులు నిరసన చేపట్టారు. ‘‘ముస్లింలు మాత్రమే వీధుల్లో నమాజ్ చేయరు’’ అనే పోస్టర్లను నిరసనకారులు ప్రదర్శించారు. హోలీ, శివరాత్రి, దీపావళి, గణేష్ చతుర్థి, రామనవమి వంటి పండుగలను హిందువులు కూడా వీధుల్లోనే జరుపుకుంటారని పోస్టర్లలో పేర్కొన్నారు. కన్వార్ యాత్ర కూడా రోడ్లపైనే జరుగుతుందని పోస్టర్లపై రాసి ఉంది. ఇదిలా ఉంటే, యూపీ మొరాదాబాద్‌లో, నమాజ్ చేయడానికి ఈద్గాలోకి ప్రవేశించకుండా ఆపినందుకు కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోపల పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండటంతో ఈద్గాలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీని తర్వాత, మళ్లీ నమాజ్ చేవారు. ఈద్-ఉల్-ఫితర్ ఉత్సవాలు ప్రారంభం కావడంతో యూపీలోని సంభాల్‌లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
గిబ్లీ స్టైల్ ఫోటోలు కావాలా? ఈ సులువైన స్టెప్స్ వాడి సులభంగా పొందండి
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలోనే తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో. ఇకపోతే, గిబ్లీ స్టైల్ ఫోటో ఎలా సృష్టించాలని చాలా మందికి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. నిజానికి గిబ్లీ స్టైల్ ఫోటోలను తయారు చేయడం చాలా సులభం. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా.. కేవలం ఈ స్టెప్స్ ఫాలో అయితే స్టెప్స్ ఫాలో అయితే చాలు. మరి మీ ఫోటోలను గిబ్లీ స్టైల్ ఫోటోలుగా ఎలా మార్చాలో చూద్దామా.. ఇందుకోసం మొదటగా చాట్ జీపీటీ chat.openai.com ఓపెన్ చేసి అందులో అకౌంట్ లాగిన్ చేయండి. ఆపై GPT-40 ను ఎంచుకోండి. అక్కడ “+” (ప్లస్) ఐకాన్ పై క్లిక్ చేసి మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి. మీ ఫోటో అప్లోడ్ చేశాక గిబ్లీ స్టైల్ అప్లై చేయండి. ఇందుకోసం “Ghiblify this” లేదా “Turn this image into Studio Ghibli theme” అని రాయండి. ఆ తర్వాత మీ ఫోటోను చాట్ జీపీటీకీ అందించండి. ఇక అంతే.. కేవలం కొన్ని క్షణాల్లో AI మీ ఫోటోను అద్భుతమైన గిబ్లీ స్టైల్ చిత్రంగా మార్చి అందిస్తుంది.
కార్ లవర్స్ కు షాక్.. రేపటి నుంచి పెరగనున్న కార్ల ధరలు
ఆటోమొబైల్ కంపెనీలు కార్ లవర్స్ కు షాక్ ఇవ్వబోతున్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ తమ మోడల్ కార్లపై ధరలు పెంచబోతున్నాయి. రేపటి నుంచే కార్ల ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకి మరోసారి తన కార్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025 నుంచి కార్లు ప్రియం కానున్నాయి. మారుతి తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను వచ్చే నెల నుంచి 4 శాతం వరకు పెంచుతామని తెలిపింది. 2025 సంవత్సరంలో మారుతి తన కార్ల ధరలను పెంచడం మూడోసారి అవుతుంది. దీనికి ముందు జనవరి, ఫిబ్రవరిలలో కూడా ధరలు పెరిగాయి. మారుతి తర్వాత దేశంలో అతిపెద్ద వాహనాల విక్రయ తయారీదారు హ్యుందాయ్ కూడా ఏప్రిల్ 2025 నుండి తన కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 2025 నుంచి మొత్తం పోర్ట్‌ఫోలియో ధర 3 శాతం వరకు పెరుగుతుంది. కియా కూడా ఏప్రిల్ 2025 నుంచి తన కార్ల ధరలను పెంచడానికి సన్నాహాలు చేసింది. ఏప్రిల్ 2025 నుంచి కియా కార్లపై 3% వరకు ధర పెరగనున్నది.రెనాల్ట్ కూడా ఏప్రిల్ 2025 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలను రెండు శాతం పెంచనున్నట్లు తెలిపారు.
మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
కుంభమేళా మోనాలిసా అంటే అసలు పరిచయమే అవసరం లేదు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా.. సోషల్ మీడియా దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన సనోజ్ మిహ్రాకు భారీ షాక్ తగిలింది. ఈయన మణిపూర్ ఫైల్స్ అనే సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈయన మీద తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సనోజ్ మిశ్రా తనను లైంగికంగా వేధించాడని ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఢిల్లీలోని నబీ కరీమ్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. 2020లో టిక్ టాక్ ద్వారా ఆమెకు సనోజ్ మిశ్రా పరిచయం అయ్యాడంట. ‘టిక్ టాక్ ద్వారా మా ఇద్దరి పరిచయం పెరిగింది. 2021 జూన్ 17న నాకు సనోజ్ మిశ్రా కాల్ చేశాడు. ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలన్నాడు. కానీ నేను వెళ్లలేదు. చనిపోతాను అని బెదిరించడంతో చివరకు వెళ్లాను. అక్కడకు వెళ్లిన తర్వాత నన్ను హోటల్ రూమ్ కు తీసుకెళ్లి నాకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ విషయం బయటకు చెబితే ఫొటోలు, వీడియోలు బయటపెడుతానంటూ బెదిరించాడు. అలా బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు’ అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సనోజ్ మిశ్రా అరెస్ట్ తో మోనాలిసా పరిస్థితి ఏంటో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. దీనిపై మోనాలిసా ఇంకా స్పందించలేదు.
భయపెట్టేలా `అమరావతికి ఆహ్వానం’ ఫస్ట్‌లుక్
ప్రస్తుత కాలంలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇటీవల బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ముంజ్య, స్త్రీ 2 చిత్రాలు దీనికి నిదర్శనం. అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథ, ఆసక్తికరమైన కథనంతో సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం అమరావతికి ఆహ్వానం. అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు జివికె దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను పరిశీలిస్తే.. ప్రధాన నటీనటులంతా నలుపు రంగు దుస్తులలో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ముఖాలు పూర్తిగా బయటపడకపోయినా, వారి కళ్లలో ఒకే తరహా తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది.
పూరీతో సేతుపతి.. పాపం తమిళ తంబీలు!!
తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతి మరియు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి ఒక కొత్త సినిమా చేయనున్నారు. ఈ విషయమై నిన్న, మార్చి 30, 2025న ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ గురించి కేవలం పుకార్లు మాత్రమే వినిపిస్తూ వచ్చాయి. అయితే, ఉగాది రోజున పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ, చార్మి కౌర్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) విడుదల కానుందని కూడా ప్రకటించారు. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జూన్ 2025 నుంచి ప్రారంభం కానుంది.