Drought Hit Mandals: కరువు ప్రభావిత మండలాలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ నిశితంగా పరిశీలించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈ 51 కరువు ప్రభావిత మండలాలను ఉన్నట్టు పేర్కొన్నారు.. డ్రౌట్ మేనేజ్మెంట్ మాన్యువల్ ప్రకారం, రైతులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం వేసవి తీవ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని, అవసరమైన నిధులు, సబ్సిడీలు, సహాయక కార్యక్రమాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా..
Read Also: Income Tax Recruitment 2025 : స్పోర్ట్స్ బాగా ఆడుతారా.. ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు రూ. 81 వేల జీతం