Kakani Govardhan Reddy: నెల్లూరు, హైదరాబాద్‌లో లేని కాకాణి.. పోలీసుల గాలింపు..!
- మాజీ మంత్రి కాకాణి విచారణ రేపటికి వాయిదా..
- రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి..
- కాకాణికి పోలీసుల తాజా నోటీసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు దొరకడం లేదు.. ఆదివారం రోజు నెల్లూరులోని మాజీ మంత్రి ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు పోలీసులు.. మరోవైపు.. హైదరాబాద్‌లో ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.. అయితే, అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. సంబంధిత నోటీసులను కుటుంబ సభ్యులకు అందజేశారట పోలీసులు..
Read Also: Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
ఇక, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఆ నోటీసుల ప్రకారం.. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కాకాణి మాత్రం హాజరుకాలేదు.. ఆదివారం రోజు నెల్లూరులోని కాకాణి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి వెళ్లారు.. అక్కడ కూడా కాకాణి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు.. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. కేసు నమోదు నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ తోపాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. రేపు హై కోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.. మరోవైపు, నెల్లూరుతో పాటు హైదరాబాద్ లో కూడా కాకాణి లేకపోవడంతో.. ఆయన కోసం పోలాసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..
కాగా, చెన్నైలో నివాసముండే విద్యా కిరణ్‌కు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉండగా.. లీజు గడువు ముగియడంతో పునరుద్దరణకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారని.. లీజుదారుడు అంగీకరించకపోయినా కొందరు ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి.. సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే మైనింగ్‌కు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి.. దీనిపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!