Salman Ali Agha: “నిన్ను తీసేస్తారా? నువ్వే రిజైన్ చేస్తావా?”.. జర్నలిస్ట్ ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ షాకింగ్ ఆన్సర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Ali Agha: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ కథ ముగిసింది. సూపర్ 8 దశలో మ్యాచ్‌లు గెలిచినా నెట్‌రన్‌రేట్ కారణంగా ఇంటికి పయనమైంది. దీంతో ఆ దేశంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబార్ ఆజాంపై సైతం విమర్శలు తారా స్థాయికి చేరాయి. అయితే.. కెప్టెన్ సల్మాన్ అలీని ఆ పదవి నుంచి తొలగిస్తారనే వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే.. నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ సల్మాన్‌కు ఈ అంశంపై ఓ ప్రశ్న ఎదురైంది. “మీరు సొంతంగా జట్టు కెప్టెన్ నుంచి తప్పుకుంటారా? లేదా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మిమ్మల్ని తొలగిస్తుందా?” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్న సంధించారు. దీనికి అఘా ప్రశాంతంగా స్పందిస్తూ.. ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకున్న భావోద్వేగానికి లోనైనట్లే. మేము స్వదేశానికి వెళ్లి రెండు నుంచి నాలుగు రోజులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యను నవ్వుతూ చెప్పడం మరింత చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలతో సల్మాన్ తక్షణంగా నిర్ణయాన్ని ప్రకటించేలా కనిపించడం లేదు. అయితే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం కెప్టెన్ పదవి నుంచి తొలగించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతుందో మరి కొన్ని రోజుల్లో బయటపడుతుంది.
READ MORE: Tata Motors February Sales: సత్తా చాటిన టాటా మోటార్స్.. హ్యుందాయ్, మహీంద్రాలకు షాక్..
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ఇదిలా ఉండగా.. ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మరో ఆసక్తికర ప్రశ్న సైతం ఎదురైంది. ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ నిర్ణయాలపై ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ పవర్‌ప్లేలో స్ట్రైక్ రేట్‌పై హెస్సన్ విమర్శలు చేసిన నేపథ్యంలో “జట్టులో కెప్టెన్‌ను చేసేది, తీసేది హెస్సనేనా? ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికలో కోచ్ ప్రభావం ఎక్కువగా ఉందా? మీరు కేవలం డమ్మీ కెప్టెన్‌గా మారిపోయారా?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు అఘా కొంత అసహనం వ్యక్తం చేశాడు. “నేను సమాధానం ఇవ్వకపోతే మీరు అవమానంగా తీసుకుంటారు. కానీ వినండి సర్, జట్టు ఒక్కరి నిర్ణయాలతో ముడిపడి ఉండదు. అందరి సంయుక్త చర్చలు, అభిప్రాయాల ఫలితం ద్వారానే జట్టును రూపొందిస్తారు. ఇది టీమ్ గేమ్” అని స్పష్టం చేశాడు. బాబర్ ఆజమ్ పాత్రపై సైతం సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు. టోర్నమెంట్‌కు వచ్చేటప్పుడు ప్రతి ఆటగాడి పాత్రను నిర్వచిస్తాం. బాబర్‌కు ఇచ్చిన పాత్ర అదే. అతని అనుభవం మాకు అవసరమని అని అఘా చెప్పాడు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!