Yarlagadda Venkata Ramana: భారతీయ జనతా పార్టీలో చేరారు ఎన్నారై, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేయడానికి యార్లగడ్డ కృషి చేయాలని సూచించారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలు నచ్చి బీజేపీలో చేరినట్లు తెలిపారు యార్లగడ్డ వెంకటరమణ.. కాగా, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మిస్సిస్సిపి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకటరమణ.. గత ఏడాది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. తానా, ఫౌండేషన్ చైర్మన్‌గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన.. వైసీపీలో చేరి.. అయితే, గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత సైలెంట్ అయ్యారు.. ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరి.. యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభిస్తాను అంటున్నారు..
Read Also: PM Modi: మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..!