RK Roja: మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. ‘ఏడుకొండల స్వామికి కునుకు కరువు!.. రోజుు 23 గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు’ అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రోజా.. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి.. కానీ, రోజుకు దాదాపు 10 వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని.. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు.. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?.. ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అంటూ కూటమి పార్టీలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. భారతీయ జనతా పార్టీపై ఫైర్ అయ్యారు.. కూటమి ప్రభుత్వంలో ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది..! కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది.. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!! అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
Read Also: SRH – HCA: HCA వివాదంపై సీఎం సీరియస్.. విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశం