సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై మంత్రి నారాయణ దృష్టిసారించారు.. తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ..
Minister Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో తన నివాసం దగ్గర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా దర్బార్ కు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ( మార్చ్ 28) చెన్నై వెళ్లనున్నారు. అడయార్‌లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది.
భూ సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి చైర్మన్ గా.. జిల్లా మంత్రి.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. జాయింట్ కలెక్టర్.. ఆర్జీవో సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు సీఎం.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ను 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీ చైర్మన్ దక్కించుకున్నామంటూ వైసీపీ వారు కేకులు కోసుకోవడం, దండలు వేసుకోవడం వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు.. ఉమ్మడి కడప జిల్లాలోని 50 జడ్పీటీసీలు రాజీనామాలు చేసి ఈరోజు ఎన్నికలకు వస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుందంటూ.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు..
పోలవరం నాకొక సెంటిమెంట్.. ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధ పడేది నేనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు.