Vallabhaneni Vamsi Case: గన్నరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరో సారి షాక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇక, ఈ కేసులో వల్లభనేని వంశీ సహా పది మంది నిందితుల రిమాండ్ పొడిగించింది.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్నారు వల్లభనేని వంశీ సహా ఇతర నిందితులు.. ఇవాళ్టితో రిమాండ్ ముగియనున్న తరుణంలో.. నిందితులను కోర్టులో హాజరు పరిచారు జైలు అధికారులు.. ఇక, ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడ తరలించారు.. ఆ తర్వాత.. వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన విషయం విదితమే..
Read Also: ‘Good Bad Ugly’ : అజిత్‌పై ప్రశంసలు కురిపించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్..