Home Minister Anitha: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వైసీపీ నేతలు అంటున్నారు.. అంతే కాదు.. వైఎస్ జగన్‌ను లేకుండా చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, జగన్‌కు తగినంత పోలీసు బందోబస్తు ఇచ్చామని చెప్పింది ప్రభుత్వం.. మాజీ సీఎం గనుక వైఎస్ జగన్‌కు భద్రత ఇచ్చాం.. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. అయితే, కేవలం రచ్చ చేయాలనే నాటకాలు ఆడారంటూ ఫైర్ అయ్యారు.. ముందు సాంకేతిక సమస్యలు ఉన్నాయి అన్న హెలికాప్టర్.. 10 నిమిషాల తరువాత ఎలా గాలిలోకి ఎగిరింది..? అని ప్రశ్నించారు.. విజయనగరం, మన్యం , శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులతో రివ్యూ నిర్వహించిన హోం మంత్రి అనిత.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు..
Read Also: Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
కేసుల ఇన్వెస్టిగేషన్ లో సాంకేతికత వినియోగిస్తున్నాం అన్నారు అనిత.. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చర్యలు చేపడుతున్నాం.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంని స్పష్టం చేశారు.. శ్రీకాకుళంలో నాలుగు కోట్ల ప్రాపర్టీని రికవరీ చేశాం.. పాడేరు, మన్యం వంటి చోట్ల గంజాయి సాగుని నివారించాం. మాదకద్రవ్యాల కేసులలో మూలాలు కనుక్కొని, ఆస్తులు జప్తు చేస్తున్నాం. గంజాయి సాగు చేసినా, స్మగ్లింగ్ చేసినా, కొనుగోలు చేసినా.. పీడీ యాక్ట్ పెడుతున్నాం. పాక్సో కేసులలో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నాం అన్నారు.. డ్రోన్, సీసీ కెమెరాలు ఉపయోగిస్తూ నేరస్తులను పట్టుకుంటున్నాం. ఈగల్ టీమ్ , సంకల్ప ప్రోగ్రాం తీసుకుంటున్నాం. యాక్టివ్ రౌడీ షీటర్ పై నిఘా ఉంచాం… స్కూళ్ల వద్ద కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేశాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.. సైబర్ క్రైమ్ స్టేషన్ జిల్లాకు ఒక స్టేషన్ పెట్టాలి అనుకుంటున్నట్టు వెల్లడించారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..