Gadikota Srikanth Reddy: వైఎస్ జగన్ ను లేకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత జగన్.. కానీ, జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. గతంలో రెండుసార్లు జగన్ పై దాడులు జరిగాయి.. పాదయాత్ర సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు.. జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్‌కు పర్యటన సమయంలో కనీస భద్రత కల్పించకపోవటం దారుణం అన్నారు.. వందల మంది పోలీసులను జగన్ భద్రతకు కేటాయించామని పోలీసులు చెప్పటం అబద్దం.. జగన్ ను లేకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.. జగన్ ను ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా గుర్తించటం లేదు.. జగన్ కు భద్రత కల్పించలేమన్న విషయాన్నైనా స్పష్టం చేయాలి.. జగన్ ఇంటి దగ్గర కూడా పోలీసులను పెట్టడం లేదు.. ఆకతాయిలు అనేక రకాల చర్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవటం లేదు.. ఇంటి దగ్గర రక్షణ లేదు, పర్యటనల్లో లేదని ఫైర్ అయ్యారు.
Read Also: Kavya : హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న బ్యూటీ
ముందుగా సమాచారం ఇచ్చి పర్యటనలకు వెళ్లినా పట్టించుకోవటం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాంత్ రెడ్డి.. జగన్ రక్షణపై త్వరలో కేంద్ర హోం మంత్రిని కలుస్తాం.. మండలానికి ఒకరిని చంపితే కానీ వీరికి భయం రాదు అని భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.. అయితే నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసులకు మేం సెల్యూట్ చేస్తాం.. జగన్ మాట్లాడింది అన్యాయాన్ని ప్రోత్సహించే పోలీసుల గురించి మాట్లాడారని స్పష్టం చేశారు.. తప్పు చేసే పోలీసుల గురించి మాట్లాడుతుంటే భుజాలు తముడుకుంటున్నారు.. పోలీసులు మీ డ్యూటీ మీరు చేయాలి.. మూడు సింహాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి.. స్వలాభం కోసం లొంగిపోయి దిగజారటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారు.. కొంతమంది పోలీసులకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని గుర్తించాలి.. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు ముగ్గురు డీజీలను పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు.. పలువురు ఐపీఎస్ సహా పోలీస్ అధికారులను పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు.. దాదాపు 200 మంది పోలీస్ అధికారులను వీఆర్ లో పెట్టారు.. పోలీస్ యూనియన్ నేతలు ఈ విషయాలు కూడా మాట్లాడాలి.. పోలీసులు కుటుంబాలతో కాస్త సమయం అయినా గడపాలి అని వీకాఫ్ లు ఇచ్చింది జగన్ అని గుర్తుచేసుకోవాలన్నారు..
Read Also: Vangalapudi Anitha: జగన్ టూర్ డ్రామాను తలపించింది.. వాట్సాప్‌లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు..!
ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు.. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో పోలీసులు రాజకీయాల్లో వేలు పెట్టొద్దని స్పష్టంగా చెప్పారు.. ఒక వర్గాన్ని కొమ్ముకాసే పోలీసులపై మా వైఖరిలో మార్పు లేదు.. చట్టాన్ని గౌరవించని పోలీసులు దొంగలతో సమానం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ రెడ్డి.. పోస్టింగ్ లు రాక కుటుంబ పోషణ కూడా జరగని పోలీసులకు న్యాయం జరిగేలా చూడాలి లని డిమాండ్ చేశారు.. ఇక, హోంమంత్రి అనితకు గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.. హోంమంత్రి ఆలోచన చేసి మాట్లాడాలి.. రెండురోజుల క్రితమే జగన్ ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది.. 1100 మంది పోలీసులతో భద్రత అని చెప్పటం కరెక్ట్ కాదన్నారు.. మీరు ఒక రాష్ట్రానికి హోం మంత్రి అని గుర్తించుకోవాలి.. మనం మాట్లాడే మాటలు సరిచూసుకోవాలి.. మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు.. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి.. 40 శాతం ఓట్లు వచ్చిన ఒక పార్టీ అధినేత అని గుర్తించుకోవాలి.. డ్రామాలు చేయాల్సిన అవసరం మాకు లేదు.. హెలిక్రాఫ్టర్ ను ఎలా చుట్టుముట్టారో విజువల్స్ లో చూడొచ్చు.. ప్రతీ ఒక్కటి రాజకీయ కోణంలో మాట్లాడటం టీడీపీ నేతలకు అలవాటు.. చేసిన తప్పులు ఒప్పుకోవటం వాళ్లకు అలవాటు లేదు.. గౌరవనీయ హోం మంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు.. జగన్ పై పెట్టిన కేసులు ఎలాంటివి అనేది అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి..