ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని చెప్పుకొచ్చారు.
GVMC Budget: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్ పై అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది.
Minister Narayana: నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేశాం.. కానీ, గత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు.
MLA Kolikapudi: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ పార్టీలో కాక రేపుతుంది. గత కొంత కాలంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొలికపూడి ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని అంజలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్ లైంగిక వేధింపులు కారణంగా మనస్థాపనతో అంజలి.. పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ మీద ఉంది.. బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో డైలీ మానిటరింగ్ చేస్తున్నారు..