పోలవరం నాకొక సెంటిమెంట్.. ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధ పడేది నేనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు.
లిక్కర్ స్కాంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆయన.. ఇది జగమెరిగిన సత్యం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు పీనట్స్ అంత ఉందని పేర్కొన్నారు..
సూర్యలంక బీచ్ కి మహర్దశ వచ్చేసింది.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.
ప్రియురాలి హత్యకు ఓ న్యాయవాది ప్రయత్నించిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది.. న్యాయవాది అన్వర్ తన కారుతో బీభత్సం సృష్టించాడు.. తన ప్రియురాలు నసీమాపై హత్యాయత్నం చేశాడు.. ఆమె ప్రయాణిస్తున్న కారును తన కారుతో ఢీకొట్టిన అన్వర్.. కారుతో గుద్ది చంపేయాలని ప్రయత్నించాడు.. ఇక, ఆ తర్వాత అదే రోడ్డులో ఉన్న మరిన్ని వాహనాలను కూడా ఢీ కొట్టి వెళ్లిపోయాడు..
బిక్కవోలులో పలువురు వైసీపీ ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేసి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.. ఈ సందర్భంగా వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీపీ ఎన్నికల్లో తొస్సిపూడి ఎంపీటీసీ సభ్యురాలు తేతలి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Minister Narayana: విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్వర్ణాంధ్ర 2047 సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి మురికివాడల రహిత నగరంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.