ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజీ అయ్యింది.. జగన్ వస్తున్నాడని తెలిసి.. భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు.. ఇక, హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే.. దాని మీదకు దూసుకుపోయారు.. దీంతో.. స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది..
అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో నిన్న, నేడు పర్యటిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయి రోడ్ల అభివృద్ధికి పవన్ చొరవతో అడుగులు పడుతున్నాయి. కాగా ఈ పర్యటనలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..…
రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆరోపించిన జగన్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు దిగజారాయి.. మొత్తం రెడ్‌బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డా.. చంద్రబాబు ఎంత భయపెట్టినా.. ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.. అయితే, వైసీపీ గెలిచినచోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు..
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది.. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి.. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి.. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది..
మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది.. సింగపూర్‌లో పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం జరగడం.. ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలు కావడంతో.. వెంటనే బయల్దేరాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను కోరారట.. పార్టీ నేతలు, అధికారులు.. అయితే, ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండడంతో.. కొంతవరకు కుదించారు.. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు.. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు అయ్యాయి.. సింగపూర్‌లో స్కూల్లో మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంలో.. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి..