ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని న్యాయమూర్తికి తెలిపిన రాజశేఖర్ రెడ్డి. అనంతరం కేసిరెడ్డి రాజ్ కేసులో ఏసీబీ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. కేసిరెడ్డి రాజ్ అరెస్ట్ పై టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని నిందుతుడి తరుపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. పీసీ యాక్ట్ నమోదు చేయటం పై న్యాయవాది పొన్నవోలు, ప్రభుత్వ తరుపు న్యాయవాది కళ్యాణి మధ్య వాదనలు జరిగాయి.
Also Read: Pravasthi Issue: ఆ అమ్మాయి బట్టలు నేనే సెలెక్ట్ చేసే దాన్ని.. ప్రవీణ కడియాల వీడియో రిలీజ్
కేసిరెడ్డి రాజ్ పబ్లిక్ సర్వెంట్ అవుతారని పిపి కళ్యాణి వాదించారు. పబ్లిక్ సర్వెంట్ కానందున 17(A) ప్రకారం శాంక్షనింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. కేసిరెడ్డి రాజ్ పబ్లిక్ సర్వెంటా? కాదా? అని స్పష్టత ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. ప్రభుత్వం తరుపు నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని కేరళ కోర్ట్ గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ను ప్రస్తావించింది పీపీ కళ్యాణి. ఎంత మొత్తంలో అవినీతి జరిగిందని జడ్జి ప్రశ్నించారు. రూ. 3200కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పీపీ కళ్యాణి కోర్ట్ కి తెలిపారు. హవాలా రూపంలో సెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని పీపీ కళ్యాణి వెల్లడించింది.
Also Read: Priyadarshi : రివ్యూలు రాయొద్దని చెప్పడం కరెక్ట్ కాదు.. స్పందించిన ప్రియదర్శి
ప్రభుత్వ ఐటీ సలహాదారు పబ్లిక్ సర్వెంట్ ఆ కాదా? అని ముందు తేల్చాలని 17(A) ఏమి చెబుతుందని తెలియచేయాలని జడ్జి ఆదేశించారు. సిట్ వేసేటప్పుడే ఈ కేసు ను ఏ కోర్ట్ కి అలాట్ చేసిందో ప్రభుత్వం జి ఓ లో తెలపలేదని పొన్నవోలు కోర్ట్ కి తెలిపారు. సిట్ అధికారుల తీరుపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. సిఐడి కోర్ట్ లో చేయాల్సిన విచారణ ఏసీబీ కోర్ట్ కి ఎలా తెచ్చారని ప్రశ్నించారు. ఈ కేసులో ఇంతవరకు ప్రభుత్వ అధికారులని ఎవరైనా అరెస్ట్ చేసారా అని ప్రశ్నించారు.
Also Read: Shine Tom Chacko : షైన్ టామ్ చాకోపై కఠిన చర్యలు తీసుకుంటాం : కేరళ మంత్రి
గత సంవత్సరం సెప్టెంబర్ లో నమోదు చేశారని పొన్నవోలు తెలిపారు. గంట ముందు మెమో వేశారని మీకే స్పష్టత లేకుంటే ఎలా అంటూ జడ్జి ప్రశ్నించారు. మెమో ఉదయమే ఇచ్చేందుకు ప్రయత్నించాము కానీ మధ్యాహ్నం 3:30 కి ఇచ్చినట్లు కోర్ట్ కి అందించామని పీపీ కళ్యాణి తెలిపారు. సిఐడి కోర్ట్ కి రిటర్న్ చేస్తామని జడ్జి చెప్పారు. మీ పై అధికారులతో మాట్లాడుకుని తెలపమని బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు.