ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇవాళ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణకు హాజరు అవుతాను అని చెప్పినా అరెస్టు చేశారని న్యాయమూర్తికి తెలిపాడు రాజశేఖర్ రెడ్డి.
Also Read:Pahalgam Terror Attack: శ్రీనగర్కు బయలుదేరిన హోంమంత్రి అమిత్ షా..
కార్ సీజ్ చేసారు నా ఇంటితో పాటు నా బంధువుల ఇళ్లలో,స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారని వెల్లడించారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేసారా అని న్యాయమూర్తి అడిగారు. కార్ తప్ప ఏమీ సీజ్ చేయలేదని కేసిరెడ్డి తెలిపారు. విచారణ పేరుతో తల్లి తండ్రులను ఇబ్బందులు పెట్టారని కేసిరెడ్డి న్యాయమూర్తికి తెలిపాడు. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని తాను సంతకాలు చేయలేదని కేసిరెడ్డి కోర్టుకు తెలిపాడు.