MLA Virupakshi: ర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించాడు. చిప్పగిరిలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో ఏకంగా సీతమ్మ వారికి ఎమ్మెల్యేనే స్వయంగా తాళి కట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Posani Krishna Murali: సినీ నటుడు, వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఈ రోజు (ఏప్రిల్ 8న) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు... కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం సందర్శించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి…
మాజీ మంత్రి విడదల రజినిపై వరుసగా ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మాజీ మంత్రి రజినిపై చిలకలూరిపేట పబ్లిక్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు పసుమర్రు రైతులు.. రజినితో పాటు ఆమె మామ, మరిదిపై కూడా కంప్లైట్ చేశారు..
15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలి.. అప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. డుంబ్రిగూడ బహిరంగ సభలో మాట్లాడుతూ.. 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రం లో కొనసాగాలి.. రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తారు.
వైఎస్ జగన్.. రాప్తాడు పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరోసారి తోపుదుర్తి సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాప్తాడు వైసీపీ టికెట్ బీసీలకు ప్రకటించాలని డిమాండ్ చేశారు.. జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి.. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందన్నారు.. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుతున్నారు.. కానీ, మాకు సీఎం చంద్రబాబు ఇలాంటి…
అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం.. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు.. వివిధ వ్యాధులపై వివరణ ఇచ్చారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రి ఉంటుంది.. దేశంలో ఉన్న అత్యుత్తమ నిపుణులు క్యాన్సర్ హార్ట్ కు సంబంధించి చికిత్సలు జరుగుతాయన్నారు.. అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. ప్రతీ నియోజక వర్గంలోనూ 100 -…
అమరావతి రాజధానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.. రాజధాని పనుల కోసం రూ.4285 విడుదల చేసింది.. అమరావతి నిర్మాణంలో తొలిదశ కింద రూ.4285 కోట్ల విడుదల చేసింది ఎన్డీఏ సర్కార్.. ప్రపంచ బ్యాంక్ రుణంలో భాగంగా ఈ నిధుల విడుదలయ్యాయి.. అమరావతి పనుల శ్రీకారానికి ప్రధాని రాక చర్చ సమయంలో నిధుల విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది..