అమరావతి రాజధానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.. రాజధాని పనుల కోసం రూ.4285 విడుదల చేసింది.. అమరావతి నిర్మాణంలో తొలిదశ కింద రూ.4285 కోట్ల విడుదల చేసింది ఎన్డీఏ సర్కార్.. ప్రపంచ బ్యాంక్ రుణంలో భాగంగా ఈ నిధుల విడుదలయ్యాయి.. అమరావతి పనుల శ్రీకారానికి ప్రధాని రాక చర్చ సమయంలో నిధుల విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది..
సంబేపల్లి మండలం మోటకట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో హంద్రీనీవా HNSS యూనిట్-2 పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రమ (50) దుర్మరణం పాలయ్యారు.. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.. పీలేరు నుండి రాయచోటి కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. సుగాలి రమ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది..
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షమ పథకాల విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేదా ఏదైనా అసంతృప్తి ఉందా? అనే కోణంపై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా.. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది ప్రభుత్వం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి.. జనసేన పార్టీకే చెందిన ఓ నాయకుడుపై మండల అధ్యక్షుడు దాడి చేయడం చర్చగా మారింది.. ఇక, పార్టీ నేతపై దాడి చేసిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ పై రాత్రి మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి చేశాడు..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల వాహనసేవ వైభవంగా సాగింది.. ఇక, ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం పరిశీలించనుంది.. ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు..
మాజీ మంత్రి కాకాణి కేసులో మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి.. కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి. ఊరు బిండి చైతన్యలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, విచారణ హాజరైనందుకు ప్రభాకర్ రెడ్డి.. చైతన్య.. గోపాలకృష్ణారెడ్డి సమయం కోరారు..
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు.