CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించిన సీఎం చంద్రబాబు.. కేంద్ర హోంశాఖ మంత్రితో కీలక చర్చలు జరిపారు.. ప్రధానంగా రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు.. నామినేషన్ దాఖలుకు ఈ నెల 29వ తేదీ తుది గడువు ముగియనుంది.
Read Also: OPPO K12s: 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానున్న ఒప్పో K12s
ఇప్పటి వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు.. మోపిదేవి వేంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయి రెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేయగా, ఇప్పటికి మూడు స్థానాలు భర్తీ చేశారు.. ఇక, మిగిలిపోయిన నాల్గో స్థానం భర్తీపై బీజేపీ, టీడీపీ మధ్య ఇవాళ చర్చలు జరిగాయని తెలుస్తోంది.. ఖాళీ అయిన స్థానాలకు ఇద్దరు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీద మస్తాన్ రావు ఎన్నిక కాగా, మూడవ స్థానాన్ని బీజేపీ.. ఆర్ కృష్ణయ్యతో భర్తీ చేసింది.. నాలుగవ స్థానాన్ని భర్తీ చేసే అంశంపై ఈ రోజు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమాలోచనలు చేశారు.. దీనిపై ఈరోజో.. రేపో.. అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు..