RK Roja: నాలుగో సారి సీఎంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు అని మాజీమంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇప్పుడు ఏదో మొదలు పెట్టారు.. మాట్లాడితే జగన్ బెంగుళూరు వెళ్తున్నారు అంటున్నారు.. గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించింది. శుక్రవారం అయితే హైదరాబాద్ కి వెళ్లి పోతున్నారు.. మీరు హైదరాబాద్ లో ఉండటం వల్లే వరదలకు విజయవాడ మునిగి పోయింది.. అధికారంలో ఉన్న మీరు హైదరాబాద్ లో తిరుగుతున్నారని జనాలు నవ్వుకుంటున్నారు.. ఇక, చంద్రబాబు తన కేసులపై విచారణ ముందు చేయించుకోవాలి.. కుంటి సాకులతో కేసుల నుంచి బయటకు వచ్చారంటూ వైసీపీ నేత ఆర్కే రోజా పేర్కొనింది.
Read Also: Vivo T4 5G: మిడ్ రేంజ్లో భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదలైన వివో T4 5G
ఇక, అమరావతిని దోచుకోవాలని అనుకున్న చంద్రబాబుపై ప్రధాని మోడీ విచారణ చేయించాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. ప్రధాని తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. అయితే, వైజాగ్ ను రాజధాని చేయాలని జగన్ కలలు కన్నారు.. పరిపాలన రాజధాని చేస్తే వైసీపీ వల్ల అరాచకాలు చేస్తారని భయ పెట్టారు.. వైజాగ్ లో 60 రోజుల ముందు పుట్టిన ఉర్సా కంపెనీకి మూడు వేల కోట్ల భూములు దారాదత్తం చేశారు.. దావోస్ లో వీళ్లకు ఒక్క ఎంఓయూ కూడా కాలేదు.. హైదరాబాద్ లో వీళ్ళు ఇచ్చిన కంపెనీకి బోర్డులు, అడ్రస్ లు కూడా లేవు.. టీడీపీకి చెందిన ఓ ఎంపీ స్నేహితుడి కంపెనీకి ఎకరాలకు ఎకరాల భూములు కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇబ్బందులపై వైసీపీ అండగా నిలబడుతుంది అని మాజీ మంత్రి రోజా తెలిపింది.
Read Also: Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు ప్రపంచ స్థాయి అవార్డు
అలాగే, హిందువులు పూజించే గోమాతలు మృతి చెందుతున్నప్పటికీ చంద్రబాబు ఒప్పుకోవటం లేదు అని వైసీపీ నేత రోజా అన్నారు. ఇప్పటికే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. ఈ ఏడాదిలో తిరుమలలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి.. చెప్పులు వేసుకుని గుళ్ళకు వస్తున్నారు.. తిరుమలలో ఏం జరుగుతుందో కూడా చూడాలని సూచించింది. శ్రీకూర్మంలో అన్నీ తాబేళ్లు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు.. ప్రజలకు మంచి చేయటానికి వీళ్లకు టైం లేదు.. ఇక, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించింది. బీజేపీ వాళ్ళు ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు సరిదిద్దటం లేదు.. కూటమిలో ఉంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా సమర్థిస్తారా అని ఆర్కే రోజా అడిగింది.
Read Also: YS Jagan: యుద్ధ వాతావరణంలోనే వైసీపీ పుట్టింది.. ఆ తర్వాత కూడా యుద్ధమే..!
కాగా, మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా.. ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించింది. ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో వీళ్ళ కుట్రలపై మాట్లాడుతున్నారు కాబట్టే కేసులు పెట్టారని పేర్కొనింది. ఆయనపై ఏ ప్రాతిపదికన విచారణ చేస్తున్నారో అర్ధం కావటం లేదు.. జగన్ స్కీములు మాత్రమే చేశారు.. జగన్ బటన్లు నొక్కితే అవినీతి జరిగే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. అయితే, చంద్రబాబు ప్రస్తుతం దోచుకునే పనులు చేస్తున్నారు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు.. వీటి వల్ల మద్యం మత్తులో దాడులు కూడా పెరిగాయి.. ఆడవాళ్ళు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు.. పవన్, చంద్రబాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే బయటకు వస్తారు.. పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు అంటూ మండిపడింది.