YS Jagan: వైసీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టిన పార్టీ.. అంతేకాదు పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నామని గుర్తుచేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పీఏసీ సమావేశంలో నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పార్టీలో అత్యున్నతమైనది. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దశ, దిశను నిర్ణయిస్తాయి. ప్రతి అంశం మీద పార్టీకి దిశా నిర్దేశం చేస్తుంది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుంది. పార్టీ ఏం చేయాలన్న దానిపైన కూడా తగిన ఆలోచనలు చేస్తుంది.. సలహాలు ఇస్తుందన్నారు.. ఇప్పుడు పార్టీని పునర్ నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ బాడీలను నిర్మిస్తూ వస్తున్నాం. జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు అబ్జర్వర్లు, పీఏసీ ఏర్పాటు ఇలా అన్నిరకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది.. గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలి.. బూత్ లెవల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి.. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు.
Read Also: US India trade deal: అమెజాన్, వాల్‌మార్ట్‌కి పూర్తి మార్కెట్ యాక్సెస్.. భారత్‌పై అమెరికా ఒత్తిడి..
ఇక, ప్రజల తరఫున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. పోరాటాలు ముమ్మరం చేస్తాం అన్నారు వైఎస్ జగన్.. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలన్న ఆయన.. పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుందన్నారు.. పార్టీకి పెద్దగా మీడియా లేదు.. కానీ, టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి.. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. గ్రామస్థాయిలో కార్యకర్తను తయారుచేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధానాన్ని వాడుకోవాలని సూచించారు.. కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడిపై వ్యతిరేకతను మూసేయడానికి ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారన్నారు..
Read Also: OPPO K12s: 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానున్న ఒప్పో K12s
చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది..? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు అన్నారు జగన్.. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారని గుర్తుచేసుకున్నారు.. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారని తెలిపారు.. ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి.. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి, పోరాటంచేయాలి.. ఎలాంటి రాజీపడొద్దు అంటూ దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..