వైసీపీలో నెమ్మదిగా లుకలుకలు బయటపడుతున్నాయి. సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని సోమవారం మాజీ మంత్రి బాలినేని ఆరోపించగా.. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా సేమ్ డైలాగ్స్ చెప్పారు. తాను కూడా బాలినేని తరహాలో సొంత పార్టీ నేతల బాధితుడినేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని.. కొందరు ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నారని.. తన విషయంలో కూడా ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తాను కూడా…
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో వైసీపీ నాయకుడి దాష్టీకం బయటపడింది. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేసి ఏజెంట్‌గా నిలబడ్డారన్న అక్కసుతో బీజేపీ మహిళా నేతపై వైసీపీ నాయకుడు హజరత్తయ్య దాడికి పాల్పడ్డాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళను ఇంటికి పిలిపించి కొట్టి, చిత్రహింసలకు గురిచేసి రూమ్‌లో నిర్బంధించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని మహిళను బెదిరించాడు. అయితే బాధిత మహిళ భయపడకుండా వైసీపీ నేత హజరత్తయ్యపై…
మంచు మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లో వైసీపీకి మద్దతిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్‌ను కూడా కలిశారు. అయితే తాజాగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని…
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలలో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగానే టీటీడీకి శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వచ్చి చేరుతోంది. మే నెలలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటిందని.. జూన్ 1 నుంచి 26 వరకు రూ.106…
ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆర్టీసీ బస్సుపై టార్పాలిన్ కవర్ వేసి తరలిస్తుండగా టీడీపీ ఫోటో తీసి ట్రోల్ చేసింది. ప్రభుత్వానికి బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గానీ వాడేస్తున్నారేంట్రా..? అంటూ బ్రహ్మానందం పిక్‌తో మీమ్‌ను టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు రూఫ్ ధ్వంసం కావడంతో బాగుచేయించే స్తోమత లేక ఇలా వాడుతున్నారా అనే…
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో రాకెట్ ప్రయోగానికి వేదిక కానుంది. ఈనెల 30న అక్కడ పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రయోగ వేదిక వద్దకు రాకెట్‌ను చేర్చారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి…
> ఈరోజు రాత్రి 7:30 గంటలకు వ్యక్తిగత పని మీద ప్యారిస్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ దంపతులు > గుంటూరు: నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం > తిరుపతి: నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం.. హాజరు కానున్న పలువురు మంత్రులు > నెల్లూరు జిల్లా కోవూరులో నేడు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం > నేడు తెలంగాణ ఇంటర్…
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 43 లక్షల 96 వేలమంది తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.6,595 కోట్లను జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమ్మ ఒడి స్కీం ద్వారా గత మూడేళ్లలో అక్క చెల్లెమ్మల ఖాతాలలో మొత్తం రూ.19,618 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రతి తల్లి తమ బిడ్డలను మంచిగా చదివించాలని తాపత్రయపడుతుందని.. అలాంటి వాళ్లకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని…
సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.46,470 టికెట్లలో లక్కీ డిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించారు. ముందువచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు జూన్ 29వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల అవుతాయని అధికారులు తెలిపారు.…