Shehrbano Naqvi: పాకిస్తాన్‌లో ‘సూపర్ ఉమెన్’ మహిళా పోలీసు అధికారి.. గంటలోనే హత్య మిస్టరీ ఛేదన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shehrbano Naqvi: బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడం ప్రశంసనీయం. కానీ అదే పని అతిగా నాటకీయంగా మారితే నవ్వుల పాలు కావాల్సిందే మరి. ఈ పరిస్థితిని ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన మహిళా పోలీస్ అధికారి ఏఎస్పీ షెహర్‌బానో నఖ్వీ స్వయంగా ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆమె, ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
Dandora OTT: ‘దండోరా’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
లాహోర్‌కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన షెహర్‌బానో నఖ్వీ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాడ్‌కాస్ట్ నడుస్తుండగానే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూ.. “ఏంటి ఖుర్రమ్… నిందితుడు దొరికిపోయాడా? చాలా బాగుంది.. నేను ఇప్పుడే వస్తున్నా” అని చెప్పి కాల్ కట్ చేశారు. ఆ వెంటనే పాడ్‌కాస్టర్‌కు “ఒక మర్డర్ జరిగింది, వెంటనే అక్కడికి వెళ్లాలి” అని చెప్పి ఆమె ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.
ఇక్కడే అసలు ట్విస్ట్. కేవలం ఒక గంటలోపే తిరిగి పాడ్‌కాస్ట్‌కు వచ్చిన నఖ్వీ.. మర్డర్ కేసు పూర్తి వివరాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. డిఫెన్స్ ఫేజ్-A, K బ్లాక్‌లో జరిగిన హత్య అని, డబ్బుల విషయంలో ఓ వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడని, నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, అతడి వద్ద బందీగా ఉన్న వ్యక్తులను కూడా విడిపించామని వివరించారు. మృతదేహం డ్రాయింగ్ రూమ్‌లో లభించిందని కూడా చెప్పారు.
Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. లోడ్ లారీ బోల్తా, బొలెరో నుజ్జునుజ్జు..!
అయితే ఈ మొత్తం వ్యవహారం నెటిజన్లకు సినిమాటిక్ సీన్‌లా అనిపించింది. ఒక గంటలో మర్డర్ కేసు సమాచారం, స్పాట్‌కు వెళ్లడం, నిందితుడిని పట్టుకోవడం, కేసు సాల్వ్ చేయడం… మళ్లీ పాడ్‌కాస్ట్‌కు రావడం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. ముఖ్యంగా పాకిస్థానీ నెటిజన్లు ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారో కానీ, యాక్టింగ్ మాత్రం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. “నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కూడా ఇంత వేగంగా అయిపోదు” అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దీనిని కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
کسی مہذب معاشرے میں ایک پولیس افسر یہ ناٹک کرتی تو اُسے نا صرف برطرف کیا جاتا بلکہ جیل ہو جاتی ! ایک گھنٹے میں FIR نہیں لکھی جاتی اس نے نا صرف قاتل پکڑ لیا وجہ قتل اور ساری کہانی میڈیا پر بتا دی عدالتیں جس کام میں سالوں لگا دیتی ہیں اس نے ایک گھنٹے میں کر دیا ۔۔ واہ دی دی واہ pic.twitter.com/1loxSxQGWV
— AliZai Vlogs (@alizaihere) December 21, 2025
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!