Srisailam Room Booking Scam: శ్రీశైలం భక్తులకు అలెర్ట్.. వసతి గదుల పేరుతో నకిలీ వెబ్సైట్ల దందా..!
- మల్లికార్జున సదన్ పేరుతో నకిలీ వెబ్సైట్లు
- ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో భక్తులకు మోసం
- ఇతర రాష్ట్రాల భక్తులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు
- అధికారిక వెబ్సైట్ల ద్వారానే బుకింగ్ చేయాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Room Booking Scam: శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. దేవస్థానానికి చెందిన ‘మల్లికార్జున సదన్’ వసతి గృహం పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి, గదుల కేటాయింపు పేరుతో భక్తుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు.
ఈ మోసపూరిత వెబ్సైట్ల బారిన పడి ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా నష్టపోయారు. కర్ణాటకకు చెందిన గురురాజ్ అనే భక్తుడు ఆన్‌లైన్‌లో వసతి కోసం వెతకగా, మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్ కనిపించింది. దానిని అసలైనదిగా నమ్మిన ఆయన, డబ్బులు చెల్లించి రసీదు కూడా పొందారు. అయితే శ్రీశైలం చేరుకున్నాక, రిసెప్షన్‌లో ఆ రసీదు చూపించగా అది నకిలీదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆ భక్తుడు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
కేవలం ఇతర రాష్ట్రాల వారే కాకుండా, తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా ఈ కేటుగాళ్ల వలకు చిక్కుతున్నారు. విజయవాడకు చెందిన సాయి మల్లిక అనే భక్తురాలు వసతి గది కోసం ఈ వెబ్సైట్‌ను ఆశ్రయించి, అందులో ఉన్న రాజేష్ అనే వ్యక్తి నంబర్‌కు నగదు పంపారు. నగదు పంపిన తర్వాత బిల్లు కోసం ప్రయత్నించగా సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు ఆమె గ్రహించారు.
గతంలో కూడా ‘శ్రీశైలం టూరిజం’ పేరుతో ఇటువంటి నకిలీ వెబ్సైట్లు రావడంతో అధికారులు వాటిని క్లోజ్ చేయించారు. కానీ ఇప్పుడు మల్లికార్జున సదన్ పేరుతో మళ్లీ అదే తరహా మోసాలు జరుగుతున్నా, దేవస్థానం అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు మోసపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
భక్తులకు సూచనలు:
- శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి దర్శనం టికెట్లు లేదా వసతి గదుల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి.
- గదుల బుకింగ్ కోసం గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ నంబర్లకు లేదా క్యూఆర్ కోడ్లకు డబ్బులు పంపవద్దు.
- ఏదైనా వెబ్సైట్ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే దేవస్థానం అధికారులకు సమాచారం అందించండి.
Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!