విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెవర శ్రీను అలియాస్ పిల్ల శ్రీను, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్ల బాలస్వామి అలియాస్ పండు, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని బానవతు శ్రీను నాయక్, అజిత్ సింగ్ నగర్ పరిధిలోని మల్లవరపు విజయ్ కుమార్ అలియాస్ మసలం,…
రాజధాని అభివృద్ధి నిధుల సేకరణకు అమరావతిలోని భూములను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 248.34 ఎకరాలను అమ్మాలని సీఆర్డీఏ నిర్ణయించింది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్ధారించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. భూముల విక్రయం ద్వారా ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను ప్రభుత్వం సేకరించనుంది. గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్…
అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అర్జెంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్నా క్యాంటీన్లను మూసేశారని ఆరోపించారు.అన్న క్యాంటీన్లకు తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే…
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన అందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ జీవో నెంబర్ 5ను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు విడుదల చేసింది.…
టీడీపీ ప్రభుత్వ హయాంలో సంభవించిన తిత్లీ తుఫాన్ సందర్భంగా నష్టపరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్లో కీలక చర్చ జరిగింది. తిత్లీ తుఫాన్ నష్ట పరిహారం పంపిణీపై సమగ్ర విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నష్టపరిహారాన్ని రైతులకు పంపిణీ చేశామనే పేరుతో నిధులను పక్కదారి పట్టించారని గత ప్రభుత్వంపై మంత్రి వర్గం ఆరోపణలు చేసింది. మొత్తం 14,135 మంది రైతులకు రూ. 28 కోట్లు పంపిణీ…
జూలై 8,9 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించబోతున్నామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసిందో ప్రజలకు వైసీపీ నేతలు వివరించాలని ఆయన సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. అటు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వనంటాడు.. బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు.. ఒకసారి మూడు…
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్‌ను ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు…
టీడీపీపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ధికపరమైన అంశాల్లో మాజీ మంత్రి యనమల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక నిర్వహణ చక్కగా చేశారంటూ ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ ప్రశంసించిందని బుగ్గన గుర్తుచేశారు. బడ్జెట్ అంచనాలకంటే తక్కువగానే అప్పులు చేశారని ఏపీని ఉద్దేశించి కాగ్ ప్రస్తావించిందన్నారు. దేశంలోనే ఆర్ధిక నిర్వహణ చక్కగా చేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగంలో ఉందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే యనమల రాంగ్…
శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కెబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమ్మ ఒడి నిధుల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారని తెలిపారు. అటు క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆక్వా…