ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి నిధులను విడుదల చేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పలువురు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద జగన్‌కు స్వాగతం పలికారు. అయితే సీఎం హెలిప్యాడ్ వద్దకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అధికారుల ఆగ్రహం…
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వచ్చేనెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించి అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జూలై 4న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని భావించినా సెక్యూరిటీ కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు.…
అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూములను ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ఆనాడు స్మశానం అని ప్రచారం చేసి ఈరోజు ఎకరం భూమి రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైసీపీ నేతలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి…
★ నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. రూ.6,594 కోట్ల మేర జగనన్న అమ్మ ఒడి పథకం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విడుదల చేయనున్న జగన్ ★ తిరుమల: నేడు సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. అందుబాటులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లు ★ ఏలూరు జిల్లా: నేడు పోలవరం వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం.. హాజరుకానున్న, ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి…
సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం మూడో ఏడాది నిధులను సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్‌గా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏడాది రూ.15వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదును జమచేస్తోంది. ఒకటి నుంచి…
మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో చాలా తమాషా నడుస్తోందని.. తనకు, ధర్మాన కృష్ణదాస్‌కు పడదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ఆయన గెలిచిన నరసన్నపేట తనకు ఇచ్చి శ్రీకాకుళం స్థానానికి వెళ్లాడని.. ప్రసాదరావు తమ కుటుంబానికి గౌరవం తెచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. అసలు తామిద్దరం ఎందుకు గొడవలు పడాలని ప్రశ్నించారు. పనికిమాలిన యదవలు మాట్లాడుతున్న…
ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని అమరావతిలో సీఆర్డీఏ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. కానీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్డీఏ మరింత కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తయిన భవనాలను లీజుకివ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. రాజధానిలో గ్రూప్-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదనలకు…
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి భారీ మెజారిటీ రావడంపై మంత్రి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో టీడీపీ పోటీలో లేకున్నా కుట్రలు చేసిందని ఆరోపించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారని.. బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా ఉన్నారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల…
మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి భరత్‌పై వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 83వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు విజయంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి…