IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌తో లాంచ్ కు సిద్ధమైన OnePlus Turbo 6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్..!
- OnePlus Turbo 6 సిరీస్ లాంచ్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్
- ఈ సిరీస్‌లో OnePlus Turbo 6, OnePlus Turbo 6V రెండు మోడళ్లు
- జనవరి 8న చైనాలో లాంచ్
- భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ఈవెంట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Turbo 6 Series: వన్ ప్లస్ (OnePlus) నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. OnePlus Turbo 6 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉంటాయని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో OnePlus Turbo 6, OnePlus Turbo 6V స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఈ రెండు ఫోన్ల డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా..
OnePlus అధికారిక Weibo పోస్ట్ ప్రకారం.. OnePlus Turbo 6 సిరీస్ జనవరి 8న సాయంత్రం 7 గంటలకు (చైనా సమయం) లాంచ్ కానుంది. ఇది భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ఉంటుంది. లైవ్ ఈవెంట్ ద్వారా ఫోన్ల డిజైన్‌తో పాటు ముఖ్య ఫీచర్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ రెండింటికీ ఒకేలా కనిపించే డిజైన్ ఉండనుంది. వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా ఐలాండ్ ఉండగా.. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు LED ఫ్లాష్ ఉంటుంది. ఫోన్లకు మ్యాట్ ఫినిష్ ఫ్రేమ్ ఉండగా, కలర్‌కు మ్యాచ్ అయ్యే ఎడ్జ్‌లను అందించారు. Turbo 6 మోడల్ బ్లాక్, సిల్వర్, టర్కాయిస్ కలర్స్‌లో వస్తుండగా.. Turbo 6V బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Mukkoti Ekadashi: రేపే ముక్కోటి ఏకాదశి.. 7 నియమాలు పాటిస్తే, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పక్కా..!
OnePlus Turbo 6లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వచ్చే ఈ ఫోన్‌కు IP68 + IP69 + IP69K డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం విశేషం. ఈ ఫోన్‌కు పవర్ అందించేది Snapdragon 8s Gen 4 ప్రాసెసర్. దీనితో పాటు LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్, Adreno 825 GPU లభిస్తాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది Android 16పై రన్ అవుతుంది.
OnePlus Turbo 6లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 8MP సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఇచ్చారు. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 9,000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తోపాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
Turbo 6తో పాటు లాంచ్ కానున్న OnePlus Turbo 6Vలో కూడా చాలా ఫీచర్లు ఒకేలా ఉంటాయి. అయితే ఇందులో Snapdragon 7s Gen 4 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ, కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు Turbo 6 మాదిరిగానే ఉంటాయని కంపెనీ టీజ్ చేసింది. మొత్తంగా శక్తివంతమైన ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో OnePlus Turbo 6 సిరీస్ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది. జనవరి 8న లాంచ్ తర్వాత ధర వివరాలు వెల్లడి కానున్నాయి.
✅ Officially Confirmed
OnePlus Turbo Series including Turbo 6 & Turbo 6V are launching on 8 January in China. pic.twitter.com/RsVEwJjMho
— TECH INFO (@TECHINFOSOCIALS) December 29, 2025
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!