Tirumala: సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.46,470 టికెట్లలో లక్కీ డిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించారు. ముందువచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు జూన్ 29వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల అవుతాయని అధికారులు తెలిపారు.
మరోవైపు శ్రీవారి ఆర్జిత సేవల కోసం లక్కీడిప్ టిక్కెట్ల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో లక్కీడిప్ టికెట్ల కోసం భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. లక్కీడిప్ ద్వారా ఎంపికైన భక్తుల వివరాలను ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు.టికెట్లు పొందిన వారు రెండ్రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం అందుతోంది.
Also Read
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?