అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వెన్నుపోట్లపై ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
* ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం తర్వాత దేవేంద్ర ఫద్నవీస్ ప్రెస్ మీట్ * నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు, ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి * నేటి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం * నేడు సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం, కొనసాగుతోన్న కౌంట్‌డౌన్ * శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు వైసీపీ…
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు.…
ఆత్మకూరు ఉపఎన్నికలో లక్ష మెజారిటీ కోసం లక్ష పాట్లు పడ్డారు వైసీపీ నేతలు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేశారు. బై ఎలక్షన్లో గెలిచినా లక్ష్యాన్ని చేరుకోకపోవడమే అధికారపార్టీ శిబిరంలో చర్చగా మారింది. ఆ అంశంపైనే పోస్టుమార్టం చేస్తున్నారట. పార్టీ నేతల అనైక్యత వల్లే లక్ష మెజారిటీ రాలేదా? ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ బరిలో లేకపోవడం.. బీజేపీ మాత్రమే బరిలో ఉండటంతో.. సులభంగా లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఆశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా…
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. పిలిచి మాట్లాడటమో.. వార్నింగ్ ఇవ్వడమో చేసేవారు పార్టీ పెద్దలు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల విషయంలో ఏ జరిగిందో పార్టీ వర్గాలు చూశాయి. కానీ.. కేబినెట్లో చోటు కోల్పోయిన నాయకులు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు.. ఆధిపత్యపోరుతో నిత్యం వర్గపోరు రాజేస్తున్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఏదో ఒక రూపంలో సడెన్‌గా భగ్గుమంటున్నారు. అసంతృప్త…
అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూలై 2న వీర మహిళలకు అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నట్లు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమని నాదెండ్ల మనోహర్…
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని…
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు, గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్…
> నేటితో ముగియనున్న రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువు > శ్రీహరికోట: రేపు జరగనున్న పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం > శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం పంచాయతీలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు > విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నేడు వైసీపీ ప్లీనరీ సమావేశం.. హాజరుకానున్న మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జిల్లా…