ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.
పార్వతీపురం జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి .. టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు.. తాను అవినీతి చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి ఆటో దగ్ధమైన ఘటనలు ఐదుగురు సజీవదహనం కావాడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదాకరమన్న ఆయన.. కూలీల సజీవ దహనం ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలుపడి ఈ ఘోరం చోటు చేసుకొందని తెలిసిందని.. రెక్కల కష్టం మీద బతికే…
సాంకేతిక సమస్య వల్ల జీపీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్-డెబిట్ లావాదేవీలు జరిగాయని పేర్కొంది సర్కార్.. జీపీఎఫ్ ఖాతాల గందరగోళంపై నివేదిక ఇచ్చారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్
ఆటోకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఎనిమిది మంది సజీవ దహనం అయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
సీఎం వైఎస్ జగన్‌కు మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు అంటూ సెటైర్లు వేశారు నారా లోకేష్.. చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ సింగిల్ గా వచ్చే సింహమా! వీధి కుక్క కూడా కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. పలు ఆన్లైన్ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు