వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ములను జమ చేసేందుకు సిద్ధం అయ్యింది ఏపీ ప్రభుత్వం.. రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ము డిపాజిట్ చేస్తారు
ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి ప్రఖ్యాత సంస్ధల ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు, కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు.
నన్ను ప్రాసిక్యూట్ చేయమని ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేనోసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకునే చెబుతాను. నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి నేను సిద్ధమే అన్నారు. నేను ఏపీ అభివృద్ధికి కమిట్ మెంటుతో ఉన్నాను. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేయండి.. నేను సిద్దమే అని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఫిర్యాదుకు రంగం సిద్ధం చేస్తోంది.. సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సూచించింది.
మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మధ్య వివాదం మరింత ముదిరింది.. ఈ వ్యవహారం సీఎస్, సీఎం వరకు వెళ్లింది.. సీఎస్ జవహర్రెడ్డిని కలిసిన పేర్ని నాని.. ప్రసన్న వెంకటేష్ ఫిర్యాదు చేయగా.. మరోవైపు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్..