వల్లభనేని వంశీకి తప్పిన పెను ప్రమాదం..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది.. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.. వంశీ వాహనశ్రేణిలో వెనక నుంచి ఓ వాహనాన్ని ఢీ కొట్టింది మరో వాహనం.. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా బటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ఘటనలో వంశీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.. ఒక వాహనం స్వల్పంగా.. మరో వాహనానికి కాస్తా ఎక్కువగానే డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుండగా.. కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని అక్కడే వదిలి.. తన కాన్వాయ్‌లోని మిగిలిన వాహనాలతో హైదరాబాద్ వెళ్లిపోయారు వల్లభనేని వంశీ మోహన్.
ఉగాది తర్వాత ఆ సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ 6 నెలలే అరుపులు, కేకలు..
ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ ఆరు నెలలు మాత్రమే అరుపులు, కేకలు ఉంటాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఒక సెలబ్రిటీ రాష్ట్రం అంతా తిరుగుతూ మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిపైన అసహనం ప్రదర్శిస్తున్నారు.. 40 ఏళ్ల ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంగితజ్ఞానం ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజలు తరిమికొడితే హైదరాబాద్ లో కాపురం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఇక, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని విమర్శించిన ఆయన.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సంక్షేమం వైఎస్సార్ పేటెంట్.. దాని మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి బొత్స.. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని జోస్యం చెప్పిన ఆయన.. ఈ ఆరునెలల కాలమే అరుపులు, కేకలు ఉంటాయన్నారు. 40 ఏళ్ల ఇండస్త్రీకి 4 ఏళ్ల పాలనకి తేడా సున్నా మాత్రమే.. మేం చేసిన మంచి పనులు 100 చెప్పగలుగుతాం.. మీరు ఏం చేశారు? అని ప్రశ్నించారు. రాజధానిలో 30 వేల కోట్ల భూములు కొనేశారని మాట్లాడడానికి అది నాలుకా, తాటిమట్టా అంటు ఫైర్ అయ్యారు. ఇక, తెలంగాణలో దోపిడీకి చంద్రబాబు కారకుడన్న ఆయన.. సైకిల్ పై కాలేజ్ కు వెళ్లిన చంద్రబాబు ఆస్తులు ఎంత..? స్కూటర్ మీద వెళ్లిన బొత్స ఆస్తులు విలువ ఎంత..?.. నక్కకి.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..! అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా..? అంటూ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.
పాదయాత్రే కాదు.. పాకుడు యాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా ఎమ్మెల్యేగా గెలవడు..!
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించనుంది.. అయితే, లోకేష్‌పై మాటల యుద్ధానికి దిగారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. లోకేష్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. పాదయాత్ర చేసినా, పాకుడు యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా.. లోకేష్ మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేడు అంటూ జోస్యం చెప్పారు.. దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాలని సవాల్ చేసిన ఆయన.. లోకేష్ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు.. ఇక, లోకేష్ ను మేం అడ్డుకుంటే ఇన్ని రోజులు పాదయాత్ర చేసి ఉండేవాడా? అని ప్రశ్నించారు.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. విజయవాడ నగరానికి చంద్రబాబు, లోకేష్ ఏం చేశారో చెప్పగలరా? అని నిలదీశారు.
ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు
కల్వకుర్తి నియోజకవర్గంలో పలు పార్టీలో నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో చేరికలు. ఇక, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల గౌడ్ లు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 40 మంది అభ్యర్థులు లేరు అని ఆయన విమర్శించారు. అమెరికా ప్రెసిడెంట్ లాగా నేను పీసీసీ ప్రెసిడెంట్ అంటారు.. కేసీఆర్ ఒక వైపు.. సంచుల మోసిన దొంగ మరో వైపు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలు, కుంభ మేళాలు చెయ్యాలి అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.. ఇప్పటి వరకు అవకాశం ఇస్తే ఏమి చేసింది కాంగ్రెస్ ?.. భూముల ధరలు పెరిగితే అభివృద్ధి అవుతుందా అని ఒకడు అంటాడు.. భూముల ధరలు పెరిగితే ఆ కుటుంబకు ధీమా ఉంటుంది.. కేసీఆర్ పథకాలు అమలు చేస్తామని బీజేపీ అంటుంది.. అవి కేసీఆర్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు ఎంది పీకేది?.. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందని ఊరు లేదు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రతిపక్షాలు అనవసరంగా ఏఎన్ఎమ్ లను రెచ్చగొడుతున్నాయి..
ప్రతిపక్షాలు అనవసరంగా ఏఎన్ఎమ్ లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మండిపడ్డారు. NHM కింద ఉన్న 2nd ఏఎన్ఎమ్ ల సమస్యలను అర్థం చేసుకొని మాట్లాడాలని కోరాము.. 5వేల 1వంద మంది సెకండ్ ఏఎన్ఎమ్ లు తెలంగాణలో వివిధ సేవలు అందిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 60 శాతం కేంద్ర నిధులతో వీరికి వేతనాలు అందిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. వీళ్ళను పర్మినెంట్ చేయడం కుదరదు.. వీరికి పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించే అవకాశం ఉందన్నాడు. 14 వందలకు పైగా పోస్టులకు నవంబర్ 2వ వారంలో పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశాము అని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మరో 4 నుంచి 5 వందల పోస్టులను కలిపి నవంబర్ లోనే పరీక్ష నిర్వహిస్తామన్నారు. అయితే 5 వేల మందిలో కొంత మంది వయోపరిమితి అయిపోయింది.. సర్వీస్ లో ఉన్న వారికి 20 మార్కులు వేయిటేజీ ఉంటుంది.. దాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. ఏఎన్ఎమ్ లు ఇంకా చాలా సమస్యలు చెప్పారు.. వాటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ రావు చెప్పారు.
ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే
మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లీడర్లు దొరకక కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుంది అంటూ సెటైర్లు వేశారు. అభ్యర్థుల నుంచి ఫీజు కూడా తీసుకుని డబ్బులు వసూలు చేస్తుంది కాంగ్రెస్.. ఒక వేళ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాంగ్రెస్ అమ్మేస్తుంది.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వస్తారని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కనపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజా బలం లేదు.. కేవలం మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి లీడర్ లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు అంటూ మంత్రి సెటైర్లు వేశాడు. ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి ఇదే బీఆర్ఎస్ పార్టీ నినాదం అని హరీష్ రావు చెప్పారు.
జనగామ టికెట్ వార్.. మరోసారి కన్నీరు పెట్టుకున్న ముత్తిరెడ్డి
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న తరుణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. ఈసారి కూడా తనకే అవకాశం ఇవ్వమంటూ సీఎంను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వేడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో కాంగ్రెస్, బీజేపీలకు జనగామలో స్థానం లేకుండా చేశానన్న ఆయన.. మొదటి లిస్టులోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎంను కోరుకుంటున్నామన్నారు. ఈ సారి తనకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించాలని వేడుకుంటున్నామని, మూడుసార్లు ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించానని, ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సీఎంను వేడుకున్నారు. బీఆర్‌ఎస్ జనగామలో బలంగా ఉందన్నారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టింది పల్లా రాజేశ్వర్ రెడ్డే అని విరుచుకుపడ్డారు. తన కూతురిని రోడ్డుపైకి తెచ్చింది పల్లానే అని ఆరోపించారు. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్‌మేట్స్ అని చెప్పుకొచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు జనగామలో సాగవని స్పష్టం చేశారు. పల్లా ఎంత ఎత్తుగా ఉంటాడో అంత ఎత్తులో కుట్రలు చేస్తారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను డబ్బులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లిందన్నారు.
కొండదిగిన టమోటా ధర.. రేపటి నుంచి చీప్‌గా..!
సామాన్యుడి వంట గదిలో టమోటా మాయం అయ్యింది.. కిలో టమోటా.. మొదట వంద.. ఆ తర్వాత రూ.200 దాటి.. కొన్ని ప్రాంతాల్లో అయితే, ఏకంగా కిలో టమోటా రూ.300 వరకు కూడా పలికింది.. అయితే, కొన్ని ప్రాంతాల్లో మార్కెట్లకు మళ్లీ టమోటాలు పెద్ద సంఖ్యలో వస్తుండగా.. ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.. మరోవైపు.. సామాన్యుడికి ఇబ్బంది లేకుండా టమోటాను అందుబాటు ధరలో ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. ఆదివారం అంటే ఈ నెల 20వ తేదీ నుంచి కిలో టమోటా రూ. 40 చొప్పున విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కిలో టమోటాను రూ.40కి విక్రయించాలని వినియోగదారుల శాఖ ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్‌లను కోరింది కేంద్ర సర్కార్. దీంతో, దేశంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న టమాటా ధర పెంపు ఇప్పుడు ఆగిపోయినట్టు అవుతుంది… ప్రభుత్వ కృషితో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన టమాటా మరోసారి వంట గదిని సుందరంగా తీర్చిదిద్దనుంది.. దేశంలో టమాటా ధరలు కిలో రూ.300కి చేరుకోగా, గత జులై 14వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద ప్రజలకు చౌక ధరలకే టమాటాను అందించడం ప్రారంభించింది. గతంలో కిలో రూ.90, ఆ తర్వాత రూ.50కి విక్రయించే టమాటాలు.. రేపటి నుంచి అంటే ఆగస్టు 20 నుంచి కిలో రూ.40 చొప్పున విక్రయించనున్నారు.
ఆలయ నిధులపై నిషేధం.. సర్క్యులర్ వెనక్కి తీసుకున్న సర్కార్
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ నిధులపై నిషేధం విధిస్తూ తన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ సహా అనేక వర్గాల నుండి విమర్శలు రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆలయాల్లో ఎలాంటి అభివృద్ధి, మరమ్మతు పనులు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ధర్మాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఈ సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. మంత్రి రామలింగారెడ్డి ఆదేశాల మేరకు కమిషనర్ శుక్రవారం సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నారు. 50 శాతం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించిన ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆలయాల మరమ్మతులు, అభివృద్ధి పనులకు నిధులు నిలిపివేయాలని ముజ్రాయి శాఖ కమిషనర్ ఆగస్టు 14న అన్ని జిల్లాల పాలనాధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడ నిధులు మంజూరైనా విడుదల కాలేదు. దీనితో పాటు, పరిపాలనా ఆమోదం పెండింగ్‌లో ఉన్న కొత్త ప్రతిపాదనలను కూడా ఆమోదించవద్దని అధికారులకు చెప్పారు.
ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్
నిప్పులపై నడవడం అనేది అప్పుడప్పుడు జాతర్లలో కనపడుతూ ఉంటాయి. తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిప్పులపై నడిచి తమ భక్తిని చాటుకుంటారు. అయితే ఈ పద్థతిని ఇప్పుడు క్రికెటర్లు అనుసరిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ నిప్పులపై నడిచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అయితే తాను నడిచింది ఏదో మొక్కుబడి కోసం కాదు. మెదడు చురుగ్గా ఉండటం కోసమని చెబుతున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఆసియా కప్ టోర్నమెంట్ కు క్రికెటర్లు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించారు. ప్రత్యర్థి జట్లు, ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రాక్టీస్ గట్టిగా చేస్తున్నారు. ఈ నెల చివర్లో పాకిస్థాన్, శ్రీలంక వేదికగా మొదలయ్యే ఆసియా కప్ కోసం ఆయా జట్ల క్రికెటర్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. అయితే ఈ టోర్నీ కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ మొహమ్మద్ నయీమ్ అనుహ్య పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆసియా కప్ ముందు అతను మైండ్ ట్రైనర్ సహాయం తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఓ మైదానంలో అతను నిప్పులపై నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.
ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని ఆయనతో కలిసి ‘జైలర్’ సినిమాను చూడబోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ను కలిశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నప్పుడు, సూపర్ స్టార్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో తన ‘జైలర్’ చిత్రాన్ని చూడాలనే తన ప్రణాళికలను కూడా పంచుకున్నాడు. గతంలో రజనీకాంత్ జార్ఖండ్, రాంచీలో చిన్నమాస్తా ఆలయంలో ఆయన దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, హిమాలయాలకు ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్ళాడు, అక్కడ ఆయన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఇక మరోపక్క రజనీకాంత్ తదుపరి సినిమాపై కూడా చర్చ జోరందుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు. అదే నిజమైతే 32 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించనున్న సినిమాగా ఇది రికార్డులకు ఎక్కనుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘హమ్’ సినిమాలో నటించారు.
గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?
ప్పుడూ చలాకీగా ఉంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ గుక్క పెట్టి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఒక సుదీర్ఘ మెసేజ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో ఆమె షేర్ చేసిన విషయం యదాతధంగా మీకోసం. హలో!! మీరందరూ మంచి ఆరోగ్యంతో, మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను, నా ఈ పోస్ట్ చూస్తున్న మీరందరూ చాలా గందరగోళానికి గురవుతారని నాకు తెలుసు. నిజానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అనేవి నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి సృష్టించారు. అయితే సోషల్ మీడియాని మంచి ప్రదేశంగా మార్చడానికి, ఒకరికొకరు అండగా ఉండండి, సమాచారమందించే విషయాలను మాత్రమే పంచుకోండి. తెలియని వారి జీవనశైలి,సంస్కృతులను తెలుసుకోండి, ఆనందాన్ని పంచండి. ఈ రోజు వీటిలో ఏదైనా నిజంగా ఉన్నాయా అని అడిగితే లేవనే చెప్ఆపాలి. ఏది ఏమైనా.. ఈ పోస్ట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, సోషల్ మీడియాలో అన్ని పోజులు, ఫోటోషూట్‌లు, క్యాండిడ్స్.. చిరునవ్వులు.. నవ్వులు.. డాన్సులు.. బలమైన కౌంటర్లు, స్ట్రాంగ్ కం బ్యాక్ మొదలైనవి నా జీవితంలో ఒక భాగమే, మీరు కూడా నా జీవితంలో ఒక భాగమే కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటాను. అలాగే నా జీవితంలోని ఈ దశలో నేను అంత బలంగా లేను, బలహీనంగా ఉన్నాను, నాకు కూడా బ్రేక్ డౌన్స్ ఉంటాయి.