Vasantha Krishna Prasad: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా.. అప్పుడే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కాకరేపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. అదే సమయంలో.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహిస్తారు.. అయితే, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అవకాశం ఇస్తే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తా లేకపోతే వ్యాపారాలు చేసుకుంటా అని ప్రకటించారు. గతంలోనే అధిష్టానానికి ఇక్కడ విషయాలు అన్నీ చెప్పాను.. ఇకపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన లేదన్న ఆయన.. నేను సౌమ్యంగా ఉందటం ఒక వైపు , రాజీ పడను అది రెండో వైపు అన్నారు.
Read Also: Prakash Raj: చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ కార్టూన్ ట్వీట్.. మండిపడుతున్న జనాలు
ఇక, భయపెట్టో, మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్ ని లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు మైలవరం ఎమ్మెల్యే.. పదవులు ఇచ్చే వరకు నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్ధులు చూపుతున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్లు, ఈ రెండూ లేని ఊళ్లు ఉండవు రాజా! అని వ్యాఖ్యానించారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే నాకు వర్గాలను అంటగడుతున్నారు.. అత్యంత నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేల్లో నేను ఒకడిని అన్నారు. నేనేంటో అధిష్టానానికి తెలుసు.. నేనేంటో కుతంత్రాలు చేసే వాళ్లకు తెలుసు.. ఏదేమైనా సీఎం వైఎస్ జగన్ మాటే ఫైనల్ అన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.