రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రా, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.. ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, అల్లూరి సీతారామరాజులలో అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.. రానున్న ఐదు రోజులు వర్షాల ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు.
విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. పోలవరం ప్రాజెక్టు బకాయిలన్నీ చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. రైల్వేజోన్ ఏర్పాటుపై మాటనిలబెట్టుకోవాలంటూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.