Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది.. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.. వంశీ వాహనశ్రేణిలో వెనక నుంచి ఓ వాహనాన్ని ఢీ కొట్టింది మరో వాహనం.. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా బటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ఘటనలో వంశీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.. ఒక వాహనం స్వల్పంగా.. మరో వాహనానికి కాస్తా ఎక్కువగానే డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుండగా.. కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని అక్కడే వదిలి.. తన కాన్వాయ్‌లోని మిగిలిన వాహనాలతో హైదరాబాద్ వెళ్లిపోయారు వల్లభనేని వంశీ మోహన్. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Health Tips : నడుం నొప్పి వేధిస్తుందా? ఈ టిప్స్ మీకోసమే..