Yarlagadda Venkata Rao: ఈ మధ్యే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో ప్రవేశించింది.. ఈ నేపథ్యంలో లోకేష్‌తో సమావేశమైన యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు.. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు నారా లోకేష్.. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది..
Read Also: CM KCR: వరంగల్ లో మేనిఫెస్టో ప్రకటిస్తా.. క్రమశిక్షణ తప్పితే.. తీసి అవతల పారేస్తా..
ఇక, యార్లగడ్డ వెంకట్రావు నిన్న హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తన సమ్మతి తెలియజేశానని.. కలిసి పనిచేద్దామని చంద్రబాబు చెప్పారు.. పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించిన విషయం విదితమే.. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైసీపీకి మద్దతు తెలుపడంతో తనను వైసీపీ నాయకులు పక్కన పెట్టారని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు.. గత మూడున్నరేళ్లుగా తాను, తన వర్గం ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పిన ఆయన.. వాటి అన్నింటిపై చంద్రబాబుతో చర్చించానన్నారు. మరోవైపు.. గన్నవరం, గుడివాడ, విజయవాడలో ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే.. అక్కడ నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించిన విషయం విదితమే.