ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయని ఎక్సై్జ్ శాఖ చెబుతోంది.. ఏపీ వ్యాప్తంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అక్టోబర్ 16వ తేదీ నుంచి నిన్నటి వరకు అంటే డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది..
Job Mela In Vijayawada: విజయవాడ నగరంలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, మన…
2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పునఃనిర్మాణ పనులు స్పీడందుకున్నాయి.. రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బాంక్ నుంచి నిధులు విడుదల అయ్యాయి.. దీంతో, పనుల్లో వేగం పెరిగింది..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది.. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమీక్షలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా చర్చించారు.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులు ఉన్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు.. అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టం అవుతోంది. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టనున్నారు.. అర్హులకు అందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ఆన్లైన్లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.