మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ పొడిగించే ఆలోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వమించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సమీక్షా సమావేశంలోనే కర్ఫ్యూ పొడగింపుపై నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. మే 31 తర్వాత క్రమంగా కొన్ని మినహాయింపులు ఇవ్వడం లేదా యథాస్థితిని కొనసాగించడమా? అనే దానిపై సోమవారం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన జీఎంవో సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్…
కరోనా కల్లోలం సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా మందు.. ఎంతో మందికి నయం చేసిందని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్యయనం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్రభుత్వం.. ఓవైపు దీనిపై అధ్యయనం జరుగుతుండగా.. మరోవైపు.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమతించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది…
టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. అమరావతిలో అసైన్డ్ భూముల కోసం చట్ట వ్యతిరేకంగా జీఓ 41 తీసుకువచ్చారన్న సీఐడీ..ఈ జీవో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, ఏపీ సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది. చంద్రబాబు పిటిషన్ కొట్టేయాలని కోరింది సీఐడీ. అసైన్డ్ భూముల విషయంలో…
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది.. ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారు కూడా యాడ్ కానున్నారు.. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అపాయింట్లు మాత్రం ఇవ్వడం లేదు.. ఇక, కోవిడ్ వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కీలక వ్యాఖ్యలు చేశారు.. కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా…