New Year 2025 Celebrations: 2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..
Read Also: AP Crime: ఈఎంఐ చెల్లించలేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి న్యూడ్ ఫొటోలు..! ట్విస్ట్ ఏంటంటే..?
2025 న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అమరావతి సిద్ధం అవుతుంది.. అమరావతిలో ఈ ఏడాది మొత్తం నాలుగు భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు..ఇందుకోసం పలు ప్రైవేట్ వేదికలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు నిర్వాహకులు.. విజయవాడ, గుంటూరులో భారీ ఈవెంట్లతో డిసెంబర్ 31st నైట్ జరగబోతోంది.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్స్ గీత మాధురి, మధు ప్రియ, నటి ముమైత్ ఖాన్ తో పాటు మరి కొందరు సినీ సెలబ్రిటీలు ఈ ఈవెంట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు..
Read Also: Wedding: పెళ్లిలో బంధువులు అత్యుత్సాహం.. కోపంతో పూజారి ఏం చేశాడంటే..! వీడియో వైరల్
పాత ఏడాది బైబై చెప్పేసి.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కొత్త ఉత్సాహంతో పార్టీలు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్ లు.. ఇలా ఎక్కడైతేనేం న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అయ్యారు.. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలబ్రెటీలతో ఈవెంట్లు, విందులు, వినోదాలు.. సంస్కృత కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. డిమాండ్‌ను బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.50 వేల పైనే పలుకుతోందని చెబుతున్నారు..