వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. వేసవి కారణంగా నీటి ఎద్దటి సమస్య, వడగాల్పులు, ఎండల ప్రభావం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించారు సీఎం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే అన్ని అడ్డంకులను అధిగమించి.. రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధం అవుతోంది.. ఈ నేపథ్యంలో అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది ఏపీ సర్కార్..
రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్ల రూపాయలు అని.. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు..
నేడు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ (సీఆర్డీఏ) కీలక సమావేశం జరగనుంది.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీఏ 45వ సమావేశం జరగనుండగా.. రాజధాని పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నా ఈ అథారిటీ.. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది సీఆర్డీఏ భేటీ..
గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని ఆరోపించారు. అలాగే, గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాత పనులు జరుగుతాయి అన్నారు. దీంతో పాటు మరో 16 సంస్థలకు చెందిన భూములకు లొకేషన్, ఎక్స్ టెన్షన్ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆరోపించారు.
Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.
MLC Ravindra Babu: ఏపీ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారధి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానిస్తూ.. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని, ప్రజలు ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్పు ఇచ్చారని అన్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ప్రజలు వైసీపీకి…
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెద్ద మార్కెట్. కానీ కొన్నాళ్లుగా రెండు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏపీలో అయితే గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ పడుకునే ఉంది. మధ్యలో రాజధాని అమరావతి నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో వచ్చిన బూమ్ కారణంగా ఏడాది పాటు పర్లేదనిపించింది. ఆ సమయం మినహా ఇంకెప్పుడూ రియల్ ఎస్టేట్ బాగున్న దాఖలాల్లేవు.
MP Appalanaidu : హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబర్ లో కూడా టీడీపీ సభ్యత్వాలు జరగనున్నాయన్నారు. మే లో కడపలో టీడీపీ మహానాడు జరుగుతుందని ఆయన తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి కావడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఢిల్లీలోను లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం…
ఆంధ్రప్రదేశ్లో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి.. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్లు మీద సైజుతో సంబంధం లేకుండా రూ. 10 చొప్పున ధరలు పెరిగాయి.. రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.