Telangana Rah-Veer Scheme: యాక్సిడెంట్ బాధితులకు హెల్ప్ చేస్తే మీ ఖాతాలోకి రూ.25,000.!
- రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25,000 బహుమతి
- ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందించడమే లక్ష్యం
- జిల్లా కమిటీ ద్వారా పారదర్శక ఎంపిక ప్రక్రియ
- గుడ్ సమారిటన్ చట్టంతో సహాయం చేసే వారికి రక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రజలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ‘రహ-వీర్’ (Rah-Veer) పథకాన్ని అమలులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయంలో సహాయం అందించి, వారి ప్రాణాలను కాపాడే వ్యక్తులకు భారీ నగదు బహుమతిని ప్రకటించింది.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో సహాయం చేయడానికి వెనుకాడుతుంటారు. ఈ భయాన్ని పోగొట్టి, బాధితులకు ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన మొదటి గంట) లోపు వైద్యం అందేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఎవరైనా వ్యక్తి రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి, సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలను నిలబెడితే, ప్రభుత్వం వారిని ‘రహ వీర్’గా గుర్తిస్తుంది. ఇలాంటి ప్రాణదాతలకు తెలంగాణ రవాణా శాఖ రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుంది.
ఈ రివార్డుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే ఈ కమిటీలో జిల్లా ఎస్పీ, జిల్లా వైద్యాధికారి (DMHO), రవాణా శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి చేర్చిన వ్యక్తి వివరాలను ఆసుపత్రి సిబ్బంది లేదా పోలీసులు నమోదు చేస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయి కమిటీ ఆ వివరాలను , ప్రమాద తీవ్రతను పరిశీలించి, సదరు వ్యక్తికి రివార్డు ఇవ్వాల్సిందిగా రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నగదు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
సహాయం చేసే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ (Good Samaritan) చట్టాన్ని పక్కాగా అమలు చేస్తోంది. దీని ప్రకారం, ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వ్యక్తిని పోలీసులు బలవంతంగా ప్రశ్నించడం గానీ, సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయడం గానీ చేయకూడదు. బాధితులను కాపాడటమే పరమావధిగా ఈ పథకం రూపొందించబడింది. కేవలం రివార్డు కోసం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయాల్లో స్పందించాలని ప్రభుత్వం కోరుతోంది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు