Amaravati Construction: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ ప్రారంభమైంది.. కొత్త ఏడాది లో పనులు ప్రారంభం చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. అనుకున్నట్టుగానే 1200 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ప్రపంచ బాంక్.. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేబడుతున్న పనులకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లోని భూముల్లో మౌలికవసతుల కల్పనకు వేర్వేరుగా టెండర్లు పిలిచింది సీఆర్డీఏ.. జోన్ 5 b 5 dలో రోడ్లు డ్రైన్లు.. ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం 1206 కోట్ల రూపాయల విలువైన పనులు జరగబోతున్నాయి. ఇక, వచ్చే నెల 21వ తేదీ వరకు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. జనవరి నెలాఖరులోగా పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది… రెండు మూడు రోజుల్లో మిగతా పనులకు టెండర్లు పిలవనున్నారు అధికారులు..
Read Also: Saraswati Barrage: అన్నారం సరస్వతీ బ్యారేజ్.. నిపుణుల బృందం పరీక్షలు పూర్తి!
కాగా, గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం విదితమే.. మూడు రాజధానుల స్టాండ్ తీసుకున్న అప్పటి వైసీపీ ప్రభుత్వం.. విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు సిద్ధమైంది.. అయితే, ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది వైసీపీ.. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో.. తాను సీఎంగా ఉన్న సమయంలో చేసిన పనులను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.. అందులో భాగంగానే కీలక పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. టెండర్లకు పిలిచింది ప్రభుత్వం..