AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయని ఎక్సై్జ్ శాఖ చెబుతోంది.. ఏపీ వ్యాప్తంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్‌బై చెప్పి ప్రైవేట్ వైన్ షాపులకు అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. టెండర్లకు ఆహ్వానించి.. ఆ తర్వాత లిక్కర్ షాపులకు కేటాయించగా.. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రైవేట్ లిక్కర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి.. అయితే, అక్టోబర్ 16వ తేదీ నుంచి నిన్నటి వరకు అంటే డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది..
Read Also: Viral News: దొంగ భక్తుడు.. హనుమంతుడికి పూజలు చేసి, కిరీటాన్ని దొబ్బేశాడు..(వీడియో)
ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు సాగగా.. 83,74,116 కేసుల మద్యం అమ్మినట్టు చెబుతున్నారు. బార్లు, వైన్ షాపులకు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.. ఇక, డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి ఈ రోజుకి ఆరోజు సరుకు పంపుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. డిసెంబర్ 30, 31 తేదీలతో పాటు.. 2025 జనవరి 1వ తేదీనా మద్యం అమ్మకాలు మరింత భారీగా సాగుతాయనే అంచనాలు వేస్తున్నారు..
Read Also: 2024 Shocking Crimes Rewind: ఈ ఏడాది దేశాన్ని కుదిపేసిన క్రైమ్ సీన్స్ ఇవే!