ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ఆన్లైన్లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
మొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి మార్చేందుకు సిద్ధం అవుతుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ).. దీనిపై ప్రతిపాదనలతో ముందుకొచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతిని చేస్తామంటోంది ఐవోసీ.. ఇక, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. కావాల్సిన సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు..
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. సచివాలయంలో ఈ రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు..
అమరావతిలో లే ఔట్లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటి అనుమతిచ్చింది అని తెలిపారు మంత్రి నారాయణ.. ఇవాళ 24,276.83 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు అనుమతులిచ్చింది.. మొత్తం ఖర్చు 62 వేల కోట్లు ఖర్చు అంచనాలో ఇప్పటి వరకూ 45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు వెల్లడించారు..
రాజధాని అమరావతితో హైవేల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాంగా రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ.. అమరావతితో హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్లను పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. హైవే నుంచి అమరావతికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ అనుమతులపై మంత్రికి వివరించారు అధికారులు.
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటున్నారు.. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అని గుర్తుచేశారు.. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని సెటైర్లు చేశారు.
రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని 26 జిల్లాలు, 40 డిపార్ట్మెంట్ లు పనితీరు, చేయాల్సిన పనులపై సమీక్షించారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎలాంటి ప్రణాళికలతో పని చేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది.. ప్రభుత్వం చేసినపాలసీలు, డిపార్ట్మెంట్ ల వారీగా తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగింది.. సమస్యలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు.. కొన్నింటికి పరిష్కారా దిశగా సూచనలు చేశారు. కొందరు అధికారుల, కొన్ని డిపార్ట్మెంట్…