AP IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు మార్లు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగగా.. ఈ రోజు 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్. మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఐజీపీ (ఆపరేషన్స్)గా సీహెచ్ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా జి. పాలరాజు, ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బి. రాజకుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక, హర్షవర్ధన్ రాజు అండ్ సుబ్బారాయుడుల బదిలీ ఆసక్తికరంగా మారింది.. సుబ్బారాయుడు ప్లేస్ లో హర్షవర్ధన్ రాజుకు తిరుపతి ఎస్పీగా అవకాశం ఇచ్చారు.. తిరుపతిలోనే ఎర్రచందనం స్మగ్లర్ల నిరోధ బాధ్యతలు సుబ్బరాయుడుకు అప్పగించారు..
Read Also: Bidar Robbery Case: బీదర్, అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్
ఐపీఎస్ అధికారుల బదిలీలు..
1. SLRPB చైర్మన్ ఆర్ కే మీనా..
2. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఎన్ మధుసూదన్ రెడ్డి..
3. టెక్నికల్ ఐజీ శ్రీకాంత్.
4. FSL డైరెక్టర్ పాలరాజు.
5. ఏసీబీ డైరెక్టర్ ఆర్ జయలక్ష్మి.
6. apsp బెటాలియన్ ఐజీడీ రాజకుమారి
7. కాకినాడ నూతన ఎస్పీ బిందు మాధవ్
8. కాకినాడ ప్రస్తుత ఎస్పీ విక్రాంత్ పాటిల్
9. వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డిఐజి కే కే ఏన్ అంబు రాజన్.
10. PTO డీఐజీ సత్య ఏసుబాబు..
11. బాబుజి ఆట్టాడా DIG గ్రే హాండ్స్
12. ఫకీరప్ప.. DIG APSP
13. విక్రాంత్ పాటిల్.. ఎస్పీ కర్నూల్
14. హర్షవర్ధన్ రాజు… ఎస్పీ తిరుపతి
15. సుబ్బారాయుడు.. ఎస్పీ రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్
16. దీపిక.. సెకండ్ కమాండెంట్ ఏపీఎస్పీ కర్నూల్
17. కేఎస్ఎస్‌వీ సుబ్బారెడ్డి.. ఎస్పీ కో ఆర్డినేషన్ హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్
18. పరమేశ్వరరెడ్డి.. SCRB ఎస్పీ
19. బిందు మాధవ్.. కాకినాడ ఎస్పీ
20. ఎస్. శ్రీధర్ సీఐడీ ఎస్పీ
21. కృష్ణకాంత్ పాటిల్.. DCP అడ్మిన్ విశాఖ .
22. ధీరజ్ కునుబిల్లి.. ఆడిషనల్ ఎస్పీ అడ్మిన్, అల్లూరి సీతారామరాజు జిల్లా
23. జగదీష్ ఆదహల్లి.. అడిషనల్ ఎస్పీ ఆపెరేషన్స్ , అల్లూరి సీతారామరాజు జిల్లా
24. రాం మోహనరావు.. ఇంటిలిజెన్స్ ఎస్పీ
25. ఎన్. శ్రీదేవిరావు, సీఐడీ ఎస్పీ
26. అశోక్ కుమార్, ఎస్పీ కడప
27. రమాదేవి.. ఎస్పీ, ఇంటెలిజెన్స్